ఆ విషయంలో జగన్ ను ఫాలో అవుతోన్న కేటీఆర్!
అవును... ఏపీలో జగన్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు మీడియాపైనా తీవ్ర స్థాయిలో మండిపడతారనే సంగతి తెలిసిందే. నేరుగా కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పేర్లు చెబుతూ విరుచుకుపడతారు.
By: Tupaki Desk | 28 July 2025 12:59 AM ISTఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇటీవల కేటీఆర్ బర్త్ డేకి జగన్... "బ్రదర్" అని కేటీఆర్ ని సంభోదిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ తరహాలోనే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ మొదలైంది. ఇద్దరూ దాదాపు ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఏపీలో జగన్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు మీడియాపైనా తీవ్ర స్థాయిలో మండిపడతారనే సంగతి తెలిసిందే. నేరుగా కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పేర్లు చెబుతూ విరుచుకుపడతారు. ఈ సమయంలో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడానికి సోషల్ మీడియానే మార్గమని కార్యకర్తలకు సూచిస్తుంటారు. ఇదే సమయంలో... పోలీసులకు, ప్రభుత్వ అధికారులకూ ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ కూడా అటు మీడియాపైనా.. ఇటు పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనా విరుచుకుపడ్డారు. నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీ.ఎన్.ఆర్. గార్డెన్ లో నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసగించిన ఆయన... అధికారం ఎవరికీ శాస్వతం కాదని పోలీసులను ఉద్దేశించి అన్నారు!
ఈ సందర్భంగా... అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రేవంత్ రెడ్డికి బానిసలా పలువురు అధికారులు పనిచేస్తున్నారని.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని.. మిత్తీతో సహా జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ "విలీనం" అనే అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను కన్ ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇదే సమయంలో... ప్రధాన మీడియా అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా... మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం సోషల్ మీడియా అని.. దానిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని.. ప్రజా సమస్యలను విస్తృతంగాగా సోషల్ మీడియాలో చూపించాలని కార్యకర్తలకు కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు.
ఇదే సమయంలో... బీఆరెస్స్ నేతల వ్యక్తిత్వాలను కించపరిచే స్లాటర్ హౌస్ ల లాగా మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడిన కేటీఆర్... రీట్వీట్ చేసినందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యక్తులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైల్లో పెడుతుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో... మీడియాపై విమర్శలు చేయడంలోనూ, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలోనూ ఇద్దరు నాయకులూ ఒకే తరహా ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు!
