Begin typing your search above and press return to search.

టిక్కెట్లు ఇచ్చేది ఆయనేనా ?

ఇక తెలంగాణా జనాలకు సగం అర్ధం అయింది. అది పూర్తిగా అర్ధం కావాలంటే కేటీఆర్ ఎన్నికలకు దగ్గర చేసి భారీ పాదయాత్రకు శ్రీకారం చుడతారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 April 2025 4:30 AM
టిక్కెట్లు ఇచ్చేది ఆయనేనా ?
X

తెలంగాణాలో గులాబీ పార్టీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది బీఆర్ఎస్ మాత్రమే. ఆ పార్టీ జెండా అది. అలాగే ఆ పార్టీ విమర్శలు ఆరోపణలు సెటైలు గులాబీ ముళ్ళ మాదిరిగా ప్రత్యర్ధులను ఠక్కున గుచ్చుకుంటాయి. ఇక కేసీఆర్ మాదిరిగా కేటీఆర్ కూడా పార్టీని శాసించే స్థితికి చేరుకున్నారు.

ఈ ఏణ్ణర్ధంలో ప్రతిపక్షంలో కేటీఆర్ బాగానే రాణిస్తున్నారు. ఇంకా మిగిలిన మూడేళ్ళ కాలంలో ఆయన మరింతగా రాటుదేలుతారని అంటున్నారు. ఇక విపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్ జరిగిన కీలక పరిణామం ఏమిటి అంటే కేసీఆర్ మెల్లగా సైడ్ కావడం ఆయన ఎంతసేపూ ఫాం హౌస్ కే పరిమితం అయి తన కుమారుడు కేటీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగించడం. ఇదంతా అనధికారికంగానే జరిగిపోతోంది.

దాంతో పార్టీలో తిరుగులేని అధికారాన్ని కేటీఆర్ ప్రదర్శిస్తున్నారు. అన్నీ ఆయనే అయి చూసుకుంటున్నారు. ఈసారి బీఆర్ ఎస్ గెలిస్తే కాబోయే సీఎం కేసీఆర్ కాదని కేటీఆర్ అన్నది పార్టీ జనాలకు బాగా ఆర్ధం అయింది. ఇక తెలంగాణా జనాలకు సగం అర్ధం అయింది. అది పూర్తిగా అర్ధం కావాలంటే కేటీఆర్ ఎన్నికలకు దగ్గర చేసి భారీ పాదయాత్రకు శ్రీకారం చుడతారని అంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక కేటీఆర్ చుట్టూ పార్టీ జనాలూ తిరుగుతున్నారు. సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా అంతా తారక మంత్రాన్నే జపిస్తున్నారు. ఈ రోజున పార్టీ నియామకాల్లో కేటీఆర్ ముద్ర ఉందని అంటున్నారు.

రేపటి రోజున టికెట్లు ఇచ్చేదీ ఆయనే అని అంటున్నారు. అంటే కేసీఆర్ అన్న ఫేస్ ఉన్నా తెర వెనక అంతా కేటీఆర్ అన్నది పార్టీలో అర్ధమై అంతా ఆయనతోనే ఉంటున్నారు. ఈసారి కేటీఆర్ సీఎం అవుతారని లెక్క వేసుకుంటున్న వారు అంతా ఆయనతోనే ఉంటున్నారు. అలా కేటీఆర్ చుట్టూ బలమైన బృందం ఏర్పడుతోంది.

కేటీఆర్ సైతం తనదైన టీం ని రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో టీడీపీ మాదిరిగానే యంగ్ టీం ని సెట్ చేస్తున్నారు అని అంటున్నారు దాంతో సీనియర్లకు ఈసారి అనుకున్నతగా చాన్స్ దక్కబోదని అంటున్నారు. ఈ విధంగా కేటీఆర్ రాజకీయ భవిష్యత్తులు సరిపడా అవసరమైన కసరత్తు అయితే దివ్యంగా సాగుతోంది అని అంటున్నారు.

కేటీఆర్ మీదనే భారం వేసి కేసీఆర్ రెస్ట్ మోడ్ లో ఉంటున్నారని అంటున్నారు. పదేళ్ళ పాటు సీఎంగా చేసిన కేసీఆర్ కి పెద్ద పదవుల మీద జాతీయ రాజకీయాల మీద ఆశలు లేవని అంటున్నారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూశారు. అనుకున్న తెలంగాణాను సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి 75 ఏళ్ళ ప్రాయానికి కేసీఆర్ వస్తారు. అందువల్ల ఆయన కోరుకునేది కుమార పట్టాభిషేకం. అందుకే చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచే పార్టీ బదలాయింపు జరుగుతోంది అని అంటున్నారు. ఈ విషయంలో సీనియర్లకు కూడా అర్థమైంది. అందుకే కేటీఆర్ కి జై అన్న వాయిస్ ఇపుడు అక్కడ బిగ్గరగా వినిపిస్తోంది.