Begin typing your search above and press return to search.

గులాబీని తుఫానుతో కలిపిన కేటీఆర్

రాజకీయాల్లో బలమంగా ఏదైనా చెప్పాలీ అంటే అధిక విశేషణాలు వాడాల్సిందే. వాడిందే వాడితే కూడా జనాలకు ఎక్కదు.

By:  Tupaki Desk   |   15 April 2025 9:00 AM IST
Ktr Comments On Congress Government
X

రాజకీయాల్లో బలమంగా ఏదైనా చెప్పాలీ అంటే అధిక విశేషణాలు వాడాల్సిందే. వాడిందే వాడితే కూడా జనాలకు ఎక్కదు. అందుకే కొత్త మాటలను వెతికి మరీ తేవాల్సి ఉంటుంది. అలాంటి మాటల పొందికలో కల్వకుంట్ల వారి ఫ్యామిలీ స్పెషలైజేషన్ చేసింది. అందుకే కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ తనదైన పద ప్రయోగం చేస్తూంటారు.

నిజానికి చూస్తే బీఆర్ ఎస్ ని గులాబీ పార్టీ అని వాడుకలో అంటారు. తుఫాన్ కి గులాబీకి అసలు పడదు. చిన్న గాలికే వణుకుతుంది గులాబీ. కానీ అదే గులాబీ తుఫాను అయి వస్తే. మరి కేటీఆర్ ఇలాగే తన పవర్ ఫుల్ డైలాగులతో అధికార కాంగ్రెస్ భవిష్యత్తుని చూపించాలని అనుకుంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమంది పదహారు నెలలు కాలేదు.

ఇంకా అధికార యోగం చాలానే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఫెయిల్ అనేస్తున్నారు బీఆర్ ఎస్ నేతలు. కేటీఆర్ మరికాస్తా ముందుకు వచ్చి ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ తుఫాను వేగంతో దూసుకుని వచ్చి అధికారం అందుకుంటుంది అని స్వీయ జోస్యం చెప్పుకున్నారు.

అంటే ఈ రోజున ప్రజలలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన గ్రహించారు అన్న మాట. అయితే గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ సీట్లు మొత్తానికి మొత్తం బీఆర్ ఎస్ గెలవలేదు కదా అని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వాపుని చూసి బలం అనుకుంటున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్ కచ్చితంగా 2028 దాకా పాలించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి అధికారం అందుకుంటుందని వారు అంటున్నారు. అయినా ఇప్పటికిపుడు ఎన్నికలు ఎందుకు వస్తాయని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం మీద అయినా ప్రజలలో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. అయితే ఎన్నికలకు చాలా దూరం ఉంటుంది. ఈ రోజున జనాలు ఇలా ఉన్నారని అప్పటికి అలా ఉంటారని భావించనక్కరలేదు అని విశ్లేషకులు అంటున్నారు.

మరో వైపు ఎవరో ఒక రాజకీయ పార్టీ కోరుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయా అని అడిగేవారూ ఉన్నారు. బీఆర్ఎస్ లో ధీమా ఏంటి అంటే తమ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది అని. అదే సమయంలో కాంగ్రెస్ లో వర్గ పోరు తెలియకుండా ఉందని అందువల్ల ఇపుడు ఎన్నికలు పెడితే గెలుస్తామని అంటున్నారు.

అయితే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఎన్నికల టాస్క్ ని ఎదుర్కోవడం అని అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలై అది తారస్థాయికి చేరితే కనుక 2028లో బీఆర్ఎస్ కే ఎందుకు బీజేపీకి చాన్స్ ఉంటుంది కదా అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా నాయకులలో ఉండాల్సింది ధీమా. సో అలా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు అని భావించాలేమో.