Begin typing your search above and press return to search.

ఆంధ్రా కంటే తెలంగాణలోనే బాగుంటుంది... కాసాని మనసులో మాట!

ఈ నేపథ్యంలో... తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని, బీజేపీ-జనసేన కూటమితో కలిసి పనిచేసే విషయంపై తనకు సమాచారం లేదని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:38 PM GMT
ఆంధ్రా కంటే తెలంగాణలోనే బాగుంటుంది... కాసాని మనసులో మాట!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ ల పోటీపై ఒక క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టులతో కలిసి వెళ్తుండగా.. బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు వెళ్లబోతోంది. ఇక, బీఆరెస్స్ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో... తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని, బీజేపీ-జనసేన కూటమితో కలిసి పనిచేసే విషయంపై తనకు సమాచారం లేదని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

అవును... తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తుందా.. పోటీ చేయడం లేదా.. పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. కాసాని సైకిల్ తొక్కబోతున్నారా.. దిగబోతున్నారా మొదలైన విషయాలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుతో ములాకత్ అయ్యారు కాసాని! అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లోనూ పోటీచేయాలని తనకు ఉందని.. అయితే ఆదివారం నారాలోకేష్ తో కలిసి చర్చించిన అనంతరం ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో... తెలంగాణలో బీజేపీ - జనసేన కూటమితో తెలుగు దేశం కలిసి పోటీ చేస్తుందా, లేదా అనే విషయంపై తనకు సమాచారం లేదని అన్నారు! తనవరకైతే... టీడీపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని ఉందని, ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు.

ఇక తెలంగాణలో టీడీపీ పరిస్థితి బాగుంటుందని, చాలా బాగుంటుందని తెలిపిన కాసాని జ్ఞానేశ్వర్... ఆంధ్రాలో కంటే తెలంగాణలో పరిస్థితి బాగుంటుందని చెప్పడం గమనార్హం!

అయితే... తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందని.. ఈ 89 స్థానాల కోసం ఏకంగా 189 మంది పోటీలో ఉన్నారని.. అందులో కొన్ని చోట్ల ఒక్కో స్థానానికి ఒక్కరు, మరికొన్ని చోట్ల ఇద్దరు, ఇంకొన్ని చోట్ల ఒక్కో సీటుకీ ముగ్గురేసి చొప్పున పోటీ ఉందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే! అయితే ఈ లిస్ట్ ను చంద్రబాబు ఫైనల్ చేస్తారని కథనాలొచ్చిన వేళ... ఆ బాధ్యత లోకేష్ కు అప్పగించినట్లు కాసాని చెబుతున్నారు.

దీంతో... తెలంగాణ టీడీపీ ఎన్ని పార్టీల్లో పోటీ చేయబోతోంది.. ఏయే స్థానాల్లో పోటీ చేయబోతోంది.. ఒంటరిగానే పోటీ చేయబోతోందా.. మొదలైన అంశాలపై ఆదివారం క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయన్న మాట.

ఆ సంగతి అలా ఉంటే... కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారబోతున్నారంటూ గత రెండు రోజులుగా ఊహాగాణాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు బీఅరెస్స్ నుంచి ఎంపీ టిక్కెట్, లేదా.. అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఆఫర్లు ఉంటే... అతనితో పాటు ఆయన సూచించిన మరొకరికి కూడా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.