Begin typing your search above and press return to search.

2024 మిస్ వరల్డ్ గా చెక్ భామకే.. మనమ్మాయి ఎక్కడ?

2024 మిస్ వరల్డ్ గా చెక్ రిపబ్లిక్ కు చెందిన అందాల భామ టైటిల్ ను సొంతం చేసుకుంది. క్రిస్టినా పిస్కోవా 2024 మిస్ వరల్డ్ గా నిలిచారు. 112 దేశాలకు చెందిన అందాల భామలు బరిలోకి దిగారు.

By:  Tupaki Desk   |   10 March 2024 4:56 AM GMT
2024 మిస్ వరల్డ్ గా చెక్ భామకే.. మనమ్మాయి ఎక్కడ?
X

2024 మిస్ వరల్డ్ గా చెక్ రిపబ్లిక్ కు చెందిన అందాల భామ టైటిల్ ను సొంతం చేసుకుంది. క్రిస్టినా పిస్కోవా 2024 మిస్ వరల్డ్ గా నిలిచారు. 112 దేశాలకు చెందిన అందాల భామలు బరిలోకి దిగారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో చెక్ రిపబ్లిక్ భామకు టైటిల్ దక్కగా.. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ ఫైనల్ పోరు అట్టహాసంగా సాగింది.

విజేతగా నిలిచిన క్రిస్టినాకు 2023 మిస్ వరల్డ్ గా నిలిచిన పోలండ్ కు చెందిన కరోలినా కిరీటం ధరింపచేశారు. ఫైనల్ పోరులో తుది అంకంలోకి వచ్చిన నలుగురిలో చెక్ భామ విజేతగా నిలిచారు. టాప్ 4గా క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. వీరిలో చెక్ భామకు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

28 ఏళ్ల అనంతరం మిస్ వరల్డ్ పోటీకి భారత్ వేదికైంది. భారీ అంచనాల మధ్య సాగిన ఈ పోటీలో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన సినీ శెట్టి టాప్ 8 వరకు రాగలిగారు కానీ.. ఆ తర్వాత టాప్ 4 కింద ఫిల్టర్ చేసిన క్రమంలో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్ కు నిరాశ మిగిలింది. కన్నడ భామ సినీ శెట్టి టైటిల్ ఫేవరెట్ గా నిలిచారు. కానీ.. ఇతర దేశాల అందాల భామలు గట్టి పోటీని ఇవ్వటంలో ఆమె ముందుకు వెళ్లలేకపోయారు.

ఈ మిస్ వరల్ట్ ఫైనల్ పోటీకి అతిధిగా నీతా అంబానీ హాజరయ్యారు. మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును నీతా అంబానీకి అందజేశారు. ఈ అవార్డును మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ ఉమెన్ జూలియా మోర్లీ ఈ అవార్డును అందజేశారు. అంగరంగ వైభవంగా సాగిన ఈ పోటీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. కాకుంటే.. భారత్ తరఫున బరిలోకి దిగిన సినీ శెట్టి వెనుదిరగటంతో భారతీయులు నిరాశకు గురైన పరిస్థితి.