Begin typing your search above and press return to search.

పేర్ని వాయిస్ ఒక్క‌టే వినిపిస్తోంది.. ఈ న‌యా గేమ్ ఏంటి...?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున చాలామంది నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చాలామంది కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2025 10:00 PM IST
పేర్ని వాయిస్ ఒక్క‌టే వినిపిస్తోంది.. ఈ న‌యా గేమ్ ఏంటి...?
X

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున చాలామంది నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చాలామంది కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఒక పేర్ని నాని పేరు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తోంది. మీడియా ముందుకు వచ్చినా.. పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించినా.. పేర్ని నాని పేరు మాత్రమే వినిపిస్తుండడం ఆయన కనిపిస్తుండడం విశేషం. మచిలీపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వరకు కూడా ఆయన పేరే వినిపిస్తోంది.

ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించినా పేర్ని నానీ ఆధ్వ‌ర్యంలోనే జరుగుతున్నాయని చెబుతున్నారు. నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫైర్ బ్రాండ్ నేతలుగా కొడాలి నాని అదేవిధంగా జోగి రమేష్ వంటి వారు ఉన్నారు. అయినప్పటికీ వారిని పార్టీ పక్కన పెట్టిందా లేక వారే పార్టీని పక్కన పెట్టారా అనేది చూడాలి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో ఒక కీలక నాయకుడిని అరెస్టు చేసినప్పుడు జోగి రమేష్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఘర్షణకు దిగారు. అతనిని విడిపించే వరకు ఉద్యమం చేశారు. అదేవిధంగా కొండపల్లిలో మట్టి తవ్వకాలు, అక్రమాలపై కూడా ఆయన గళం వినిపించారు.

అయినప్పటికీ పేర్ని నానికి ఇస్తున్న ప్రాధాన్యం జోగి రమేష్ కు ఇవ్వడం లేదన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. నిజానికి వైసీపీకి ఉన్న సోషల్ మీడియా అదే విధంగా ప్రధాన మీడియాలలో జోగి రమేష్ కు సంబంధించిన వార్తలు కానీ ఆయనకు సంబంధించిన అంశాలను గాని ప్రధానంగా ప్రస్తావించడం లేదు. ఇక, గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని దాదాపు సైలెంట్ అయిపోయారు. ఆయన పుంజుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన వాయిస్ కూడా ఎక్కడా వినిపించడం లేదు.

ఎక్కడ ఏం జరిగినా పేర్ని నాని పేరు వినిపిస్తోంది. పేరు నానికే ప్రాధాన్య ఇస్తున్నారు. నాని మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు కూడా మౌనంగానే ఉన్నారు. అదే విధంగా విజయవాడ మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఏదో చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరు కావడం, అక్కడికే పరిమితం కావడం వంటివి కనిపిస్తున్నాయి. దీంతో నానీకి పెరుగుతున్న ప్రాధాన్యం పట్ల జిల్లాలో ఆసక్తికర చర్చి నడుస్తోంది.

కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక‌ చేసుకునే ఉద్దేశంతోనే పేర్ని నానికి ప్రాధాన్యమిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండటం.. ముఖ్యంగా విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉండడం అదేవిధంగా అవనిగడ్డ, కైకలూరు, మచిలీపట్నం నియోజకవర్గంలో వీరి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేర్ని నానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాపులను సంతృప్తి పరిచే దిశగా వైసిపి అడుగులు వేస్తోంద‌నే చ‌ర్చ కూడా నడుస్తోంది.