Begin typing your search above and press return to search.

కొత్తపల్లి పాత పార్టీ : చినబాబుతో సడెన్ ఎంట్రీ !

దానికి కారణం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ యువ నేత లోకేష్ తో పాటే కనిపించారు. ఆయనతో కలసి వస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 3:49 PM GMT
కొత్తపల్లి పాత పార్టీ : చినబాబుతో సడెన్ ఎంట్రీ !
X

పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరబోతున్నారా అన్న చర్చ వస్తుంది. దానికి కారణం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ యువ నేత లోకేష్ తో పాటే కనిపించారు. ఆయనతో కలసి వస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

కొత్తపల్లి మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. నిజానికి కొత్తపల్లికి తెలుగుదేశం పార్టీ పాత పార్టీనే. ఆయన 1989లో టీడీపీ నుంచే తొలిసారిగా నర్సాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అలా ఆయన నాలుగు విడతలుగా ఎమ్మెల్యే అయ్యారు. బాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

అయితే 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ చేసి ఓడారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 నాటికి వైసీపీలో చేరి నర్సాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. ఆ మీదట టీడీపీలో చేరి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు. 2019 నాటికి వైసీపీలోకి వచ్చారు. ఇక కొంతకాలం క్రితం నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో వచ్చిన విభేదాల వల్ల వైసీపీని వీడారు.

వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుస్తాను అని ఆయన చెబుతూ వస్తున్నారు ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ అయితే ఉంది. ఆయన జనసేనలో చేరుతారు అని వినిపించినా ఇపుడు సుబ్బారాయుడు అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయని అంటున్నారు. అందుకే ఆయన లోకేష్ వెంట కనిపించారు అని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక కొత్తపల్లి గట్టిగానే రియాక్ట్ అయ్యారు. బాబు అరెస్ట్ అక్రమం అంటూ నియోజకవర్గంలో ర్యాలీలు తీశారు. బాబుని అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ మీద నిప్పులు చెరిగారు.

మరో వైపు చూస్తే నర్సాపురం ఎంపీ వైసీపీ రెబెల్ నేత రఘురామ క్రిష్ణం రాజుతో ఢిల్లీలోనూ కొత్తపల్లి కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది అంటున్నారు. అయితే ఆయన పోటీ చేయాలనుకుంటున్న నర్సాపురం అసెంబ్లీ సీటు ఖాళీ అయితే లేదు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అక్కడ టీడీపీ ఇంచార్జిగా ఉన్న పొత్తూరు రామరాజు టికెట్ రేసులో ఉన్నారు.

వీరిని కాదని కొత్తపల్లికి టికెట్ ఇస్తారా అంటే డౌటే అని అంటున్నారు. పైగా టీడీపీలో చేరి బయటకు వెళ్ళి ఇతర పార్టీలలో చేరిన కొత్తపల్లి కంటే పార్టీని నమ్ముకున్న వారికే బాబు టికెట్ ఇస్తారని అంటున్నారు. అయితే కొత్తపల్లికి వేరే ఆప్షన్ లేదు అని అంటున్నారు. ఆయన పొత్తు లేకపోతే జనసేనలో చేరాలని అనుకున్నారు. కానీ పొత్తు టీడీపీతో ఆ పార్టీ పెట్టుకుంది. వైసీపీని వదిలేసి వచ్చారు. అలా పుష్కర కాలంగా ఎమ్మెల్యే కావాలని చూస్తూ మూడు పార్టీలు మారినా కొత్తపల్లికి చివరికి పాత పార్టీయే దిక్కు అవుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.