Begin typing your search above and press return to search.

ఆదిమూలంపై రే*ప్ కేసు..గుండెపోటు!

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ టీడీపీ మహిళా కార్యకర్త అత్యాచార ఆరోపణలు చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Sept 2024 2:26 PM
ఆదిమూలంపై రే*ప్ కేసు..గుండెపోటు!
X

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ టీడీపీ మహిళా కార్యకర్త అత్యాచార ఆరోపణలు చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన టీడీపీ అధిష్టానం ఆదిమూలం ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ వీడియోలు మార్ఫింగ్ చేశారని, తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆదిమాలం అంటున్నారు.

ఈ క్రమంలోనే తనపై కుట్ర జరిగింది అని చెబుతున్న ఆదిమూలం తాజాగా ఈరోజు గుండెపోటుతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరడం షాకింగ్ గా మారింది. అంతేకాకుండా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆదిమూలంకు స్టెంట్లు వేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు లైంగిక వేధింపుల, రేప్ కేసు నమోదు చేయడంతోనే ఆయన ఆసుపత్రిలో చేరారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, ఆదిమూలంపై బాధిత మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం ఆయనపై రేప్ కేసును పోలీసులు నమోదు చేశారు.

ఆమె చెప్పిన తేదీల్లో సదరు హోటల్ లోని సీసీటీవీ ఫుటేజ్ తో పాటు మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికే ఆ హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హోటల్ రికార్డుల ప్రకారం ఆ మహిళ చెప్పిన తేదీలలో ఆదిమూలం అక్కడ రూమ్ బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ హోటల్ కు ఆయన రెగ్యులర్ గా వస్తుంటారని హోటల్ యాజమాన్యం చెప్పినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఆదిమూలం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, తానే తప్పు చేయలేదని ఆదిమూలం వాదిస్తున్నారు. రాజకీయ కుట్ర తోనే తనపై ఓ మహిళను పావుగా వాడి తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. కానీ, తన వలన పార్టీకి చెడ్డ పేరు రాకూడదని, అందుకే పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అంటున్నారు.