వాసుపల్లిని పక్కన పెట్టేసిన జగన్ ..!
వాసుపల్లి గణేష్. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే . గతంలో టీడీపీ తరఫున విజయం దక్కిం చుకున్న ఆయన.. తర్వాత.. వైసీపీ పంచన చేరారు.
By: Tupaki Desk | 27 May 2025 9:11 AM ISTవాసుపల్లి గణేష్. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే . గతంలో టీడీపీ తరఫున విజయం దక్కిం చుకున్న ఆయన.. తర్వాత.. వైసీపీ పంచన చేరారు. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మార్పుపై కొన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో.. తిరిగి టీడీపీ రానిస్తుందో లేదో.. అనే సందేహాలు ముసురుకుని ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు.
ఇదిలావుంటే.. వాసుపల్లి గణేష్‌ను జగన్ పక్కన పెట్టేశారు. ఆయన పార్టీలోనే ఉన్నారో.. లేదో తెలియని నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని నియమించారు. ఆయనే యువ నాయకుడు కొండా రాజీవ్. వైసీపీ తరఫున సోషల్ మీడియాలోనూ.. సాధారణ మీడియాలోనూ బలమైన వాయిస్ వినిపించే కొండా రాజీవ్.. ఇప్పుడు దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
అయితే.. వచ్చే ఎన్నికల నాటికి రాజీవ్‌కే టికెట్ ఇస్తారా? లేదా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి ఆయ నకు మాత్రం పదవిని ఇచ్చారు. పార్టీ పరంగా దూకుడు చూపించే నాయకుడిగా పేరున్న రాజీవ్‌కు సము చిత గౌరవమే లభించింది. అయితే.. ఆయనకు ఇక్కడ పుంజుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఎందు కంటే.. చాలా కష్టాలు.. అనేక సవాళ్లు రాజీవ్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రధానంగా కలివిడిలేని నాయకత్వం రాజీవ్‌కు ప్రధాన సమస్యగా మారనుంది.
అదేసమయంలో దక్షిణ నియోకవర్గంలో వైసీపీ ఇప్పటి వరకు పట్టు సాధించలేక పోయింది. పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ విజయం దక్కించుకున్న హిస్టరీ లేదు. సో.. రాజీవ్ ఇక్కడ పార్టీని డెవలప్ చేయాలంటే.. ఖచ్చితంగా.. క్షేత్రస్థాయి నుంచి యుద్ధం చేయాలి. ప్రతి ఒక్కరినీ కలుసుకుని తీరాలి. అదేసమయంలో వైసీపీ వ్యతిరేకతను తట్టుకుని నిలవాలి. ఖర్చుకు ఖర్చు.. శ్రమకు శ్రమ రెండూ ఉంటాయి. సాయిరెడ్డి లాంటి వ్యక్తులకే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు కొరుకుడు పడలేదు. సో.. ఇవన్నీ ఆలోచిస్తే.. రాజీవ్‌కు చాలా బాధ్యతే ఉందని తెలుస్తోంది.
