Begin typing your search above and press return to search.

జ‌న‌సేన టాక్: కొణాతాల‌కు అమాత్య కొలువు?

జ‌న‌సేన వ‌ర్గాల్లో ఈ చ‌ర్చ జోరుగాసాగుతోంది. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌కు చెందిన కొణ‌తాల గ‌తంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకు న్నారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.

By:  Garuda Media   |   4 July 2026 12:30 PM IST
జ‌న‌సేన టాక్: కొణాతాల‌కు అమాత్య కొలువు?
X

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుడిగా ఎదిగి.. ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పై కొన్నేళ్ల‌పాటు పోరాటం చేసిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా? ఆయ‌నను మంత్రిగా ప్ర‌మోట్ చేయాల‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. జ‌న‌సేన వ‌ర్గాల్లో ఈ చ‌ర్చ జోరుగాసాగుతోంది. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌కు చెందిన కొణ‌తాల గ‌తంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకు న్నారు. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.

ఆ త‌ర్వాత‌.. వైసీపీలోచేరాల‌ని అనుకున్నారు. కానీ, జ‌గ‌న్ వైఖ‌రితో విభేదించిన కొణాతాల ఆది లోనే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. సుమారు 7 సంవ‌త్స‌రాలు నిరీక్షించి.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన టికెట్‌పై అనాక‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, మూడు ప‌ద‌వులు మాత్ర‌మే జ‌న‌సేన‌కు రావ‌డంతో ఆయ‌న వెనుక‌బ‌డ్డారు.

ఇక‌, త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్న నేప‌థ్యం లో ఇప్పుడు మ‌రోసారి కొణతాల పేరు జ‌న‌సేన వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మంత్రివ‌ర్గంలోకి ఆయ‌న చోటు క‌ల్పిం చ‌డం ఖాయ‌మ‌ని కీల‌క నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో కొణాతాల‌కుఉన్న అనుబంధం, నాయ‌కుడి గా ఉన్న మంచి గ్రాఫ్ వంటివి క‌లిసి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. వివాద ర‌హితంగానే కాకుండా.. రాజ‌కీయంగా కూడా అనుభ‌వం ఉండ‌డంతో ఇది జ‌న‌సేన‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌పై జ‌న‌సేన ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ స‌త్తా చాటాల‌ని కూడా ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని.. ఇటీవ‌ల పార్టీ కీల‌క నాయ‌కుడు నాగ‌బాబు సైతం చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాం ధ్ర‌లో మంచి పేరుతోపాటు.. ఫాలోయింగ్ కూడా ఉన్న కొణతాల వంటివారికి అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. ల‌క్ష్యాన్ని సాధించే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు పెరుగుతున్నాయి. గ‌వ‌ర సామాజిక వ‌ర్గానికి చెందిన కొణ‌తాల‌కు మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం ఇస్తే.. అది పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా మేలు చేస్తుంద‌న్న అభిప్రాయం జ‌న‌సేన‌లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.