కొమ్మినేనికి బెయిల్.. యాదృచ్ఛికమా..? వైసీపీ కష్టమా?
సీనియర్ జర్నలిస్టు, వైసీపీ మీడియా సాక్షిలో యాంకర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Jun 2025 9:00 PM ISTసీనియర్ జర్నలిస్టు, వైసీపీ మీడియా సాక్షిలో యాంకర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇది జరిగి మూడు రోజులు అయినా.. ఇంకా హాట్ టాపిక్‌గానే రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. దీనిపై అనేక జర్నలిస్టు సంఘాలు సభలు, సమావేశాలు పెట్టారు. జర్నలిస్టులపై కేసులు.. వేధింపులు.. వంటి కీలక అంశాలపై వారు చర్చించారు. ఇదేసమయం లో కొమ్మినేనికి బెయిల్ రావడంపై వైసీపీ జబ్బలు చరుచుకుంది.
తాము సాధించిన గొప్ప విజయం అంటూ.. వైసీపీ పొంగిపోయింది. కూటమి సర్కారు వేధింపుల పర్వంపై తాము నెగ్గామని.. కూటమి సర్కారుకు చెంప పెట్టు అని వైసీపీ అధినేత జగన్ కూడాసుదీర్ఘ పోస్టు చేశారు. అయితే.. అసలు, కొమ్మినేనికి బెయిల్ రావడం వెనుక నిజంగానేవైసీపీ కష్టపడిందా? లేక.. యాదృచ్ఛికం గానే ఇది లబించిందా? అనేది కీలక ప్రశ్న. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను.. బట్టి చూస్తే.. ఈవిషయంలో వైసీపీ చేసిన కృషి కంటే కూడా.. రాజ్యాంగం ప్రసాదించిన అవకాశం గానే మేధావులు చెబుతున్నారు.
నిజానికి వైసీపీ చేసింది ఏమీ లేదనేది మేధావులు చెబుతున్న మాట. ''నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా?'' అనే ఒకే ఒక్క కారణం.. కొమ్మినేనికి కలిసి వచ్చిందని మేధావులు చెబుతున్నారు. ఇదే పాయింట్ లేకపోతే.. ఆర్టికల్ 19/1,19, 19/2 నియమాలను సుప్రీంకోర్టు విస్మరించి ఉంటే.. కొమ్మినేనికి అసలు బెయిల్ వచ్చేది కాదన్నది మేధావులు చెబుతున్న మాట. ఈ విషయాలను వైసీపీ తరఫున వాదనలు వినిపించిన వారిలో ఒక్కరు కూడాబలంగాచెప్పలేదు.
అయినప్పటికీ.. సుప్రీంకోర్టు మాత్రం భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ.. జర్నలిజాన్ని ప్రజాస్వా మ్యపు నాలుగో స్తంభంగాగుర్తించిన నేపథ్యంలో ఇతర వాదనలను పక్కకు పెట్టింది. ఈకారణంగానే కొమ్మినేనికి బెయిల్ దక్కిందన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. కానీ.. వైసీపీ మాత్రం తాము చేసిన వాదనల ప్రకారమే.. కొమ్మినేని బయటకు వచ్చారని చెబుతోంది. ఇలాప్రచారం చేసుకోవడం తప్పులేదు.. కానీ, వాస్తవాన్ని గ్రహిస్తే.. భవిష్యత్తులో ఆ పార్టీకేమంచిదని.. అంటున్నారు పరిశీలకులు.
