Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి అంత పెద్ద త్యాగమా... కాంగ్రెస్ లో ఏమి జరుగుతోంది...?

అలాంటి కాంగ్రెస్ ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను అవసరం అనుకుంటే నల్గొండ సీటుని త్యాగం చేస్తాను అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 2:59 PM GMT
కోమటిరెడ్డి అంత పెద్ద త్యాగమా... కాంగ్రెస్ లో ఏమి జరుగుతోంది...?
X

తెలంగాణా రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఒక స్టైల్. ఆయన నల్గొండ జిల్లా రాజకీయాల్లో అగ్ర భాగాన ఉంటారు. కాంగ్రెస్ లో కచ్చితంగా గెలిచే నేతలలో ఆయన ఒకరు. అలాంటి కాంగ్రెస్ ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను అవసరం అనుకుంటే నల్గొండ సీటుని త్యాగం చేస్తాను అని అంటున్నారు. అంటే పోటీ చేయను అని చెప్పేస్తున్నారు అన్న మాట.

ఇలా ఎందుకు ఆయన మాట్లాడారు అంటే దానికి ఒక విషయం ఉంది. గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి కాంగ్రెస్ లో సీట్ల కోసం ఆశావహుల నుంచి మంచి పోటీ ఉందని అన్నారు. ఇక బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నారు. తాము డిక్లరేషన్ ఇచ్చి మాట తప్పకూడదని అన్నారు. అందువల్ల నల్గొండ సీటు బీసీల కోసం త్యాగం చేయాల్సి వస్తే తాను రెడీగా ఉంటాను అని చెప్పేశారు. ఒక విధంగా ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారనే అనుకోవాలి.

కాంగ్రెస్ లో సీట్లో కోసం పెద్ద పంచాయతీ అవుతూంటే కోమటిరెడ్డి మాత్రం చాలా ఈజీగా తాను త్యాగం చేస్తాను అంటున్నారు. అయితే దీని వెనక కూడా వ్యూహాలే ఉన్నాయా అన్న డౌట్లు వస్తున్నారు. కోమటిరెడ్డి ఒక్కరే త్యాగం చేస్తే అది ఆయనతో ఆగిపోదు, అదే టైం లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలీ అంటే చాలా మంది సీట్లు త్యాగం చేయాలి. అపుడే బీసీ డిక్లరేషన్ కి విలువ. అందుకే కోమటిరెడ్డి తనతోనే మొదలెట్టారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీట్ల కోసం బాగా పోటీ ఏర్పడింది. అదే టైం లో అనేక నియోజకవర్గాలలో ఆశావహులు క్యూ కడుతున్నారు. దీంతో చాలా మంది సీనియర్లకు త్యాగాలు తప్పవా అన్న చర్చ మొదలైంది. ఇక తన నియోజకవర్గంలో ఆరు దరఖాస్తులు వచ్చాయని కోమటిరెడ్డి అంటున్నారు. అంటే మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వచ్చిన అప్లికేషన్స్ చూసి అందరి బలాబలాలు పరిశీలిస్తామని కోమటిరెడ్డి చెబుతున్నారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని కోమటిరెడ్డి అంటున్నారు. దానికి తామంతా అంగీకరించామని అంటున్నారు. తమకు గెలుపు తప్ప మరొకటి లేదని కోమటిరెడ్డి స్పష్టం చేయడం విశేషం.

ఇక కేసీయార్ మీద కూడా కోమటిరెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. బీసీలకు మూడెకరాలు ఇస్తామని చెప్పి కేసీయార్ మాట తప్పరని, మాట తప్పితే తల నరుక్కుంటాను అని కేసీయార్ అన్నారని, ఇపుడు ఆయన ఏమైనా మొండెంతో తిరుగుతున్నారా అని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇవన్నీ చూస్తూంటే తెలంగాణా కాంగెర్స్ లో టికెట్ల టెన్షన్ అయితే స్టార్ట్ అయింది అనిపిస్తొంది. ఇక తెలంగాణా కాంగ్రెస్ కి స్క్రీనింగ్ టెస్ట్ అన్నది ఒక విధంగా అగ్ని పరీక్ష అని అంటున్నారు.

మరో వైపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది. చాలా చోట్ల సీనియర్లకే చెక్ పెడుతూ ఆశావహులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇలా కనుక చూసుకుంటే జనగామలో మాజీ మంత్రి పొన్నాల వర్సెస్ కొమ్మూరు ప్రతాపరెడ్డి, అల్గే వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ మెఘారెడ్డి, శివసేనారెడ్డి, ఎల్బీ నగర్ లో మధుయాష్కీ వర్సెస్ మల్ రెడ్డి రంగారెడ్డి, కల్వకుర్తిలో వంశీ చందర్ రెడ్డి వర్సెస్ రాఘవరెడ్డి, కొళాపూర్ లో జూపల్లి వర్సెస్ జగీదీశ్వర్ రెడ్డిల మధ్య తీవ్ర పోరు సాగుతోంది. వీరిలో ఎవరికి టికెట్ వచ్చినా మిగిలిన వారు ఏమి చేస్తారో అన్న టెన్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది అని అంటున్నారు.