Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ పార్టీ అధ్యక్షుడు కావాలట

తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు మునుగోడు ఎమ్మెల్యే..కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By:  Tupaki Desk   |   16 Feb 2024 4:25 AM GMT
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ పార్టీ అధ్యక్షుడు కావాలట
X

తెలంగాణ రాజకీయాల్లో తరచూ హైలెట్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్ రావు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలను సమర్థంగా ఎదుర్కొంటున్నది ఒక్క హరీశ్ ఒక్కరే. మాజీ మంత్రి కేటీఆర్ తో పోలిస్తే.. హరీశ్ వాదనాపటిమ బెటర్ గా ఉందంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హరీశ్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు తరచూ ఆయన్ను వార్తల్లోకి తీసుకొస్తున్నాయి.

తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు మునుగోడు ఎమ్మెల్యే..కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో తమకు 72 సీట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మజ్లిస్ తమ వెంటే ఉందన్న ఆయన.. ఆ పార్టీ అధికార పక్షంపై ఉండటం తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. హరీశ్ రావును బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షడ్ని చేయాలని.. అప్పుడు మాత్రమే ఆ పార్టీ బతుకుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ లో చాలామంది అవినీతి నేతలు ఉన్నారని.. తమ పార్టీలోకి క్లీన్ చిట్ ఉన్న వారినే తీసుకుంటామన్న ఆయన.. ''అవినీతి మరకలు లేని వారికే పార్టీలోకి అవకాశం. బీఆర్ఎస్ లో చాలామంది నేతలు అవమానానికి గురై ఉన్నారు. డబ్బున్న నేతలు పార్టీలోకి వస్తే వారిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వస్తుందో నాకు తెలీదు. ప్రభుత్వం పడిపోవటానికి ఒక్క ఉదంతం చాలు. 2029లో ఏం జరుగుతుందో ఇప్పుడేం చెప్పలేం'' అంటూ వ్యాఖ్యానించారు.

దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న టాక్ నడుస్తుందన్న రాజగోపాల్.. ఈటలను ఓడించేందుకే దళితబంధును కేసీఆర్ తీసుకొచ్చారే తప్పించి.. దళితుల మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ లేదన్నారు. కేటీఆర్ రాజకీయ నాయకుడు కాదని.. హైటెక్ పొలిటీషియన్ అంటూ పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ .. బీజేపీ మధ్యనే పోటీ అన్న ఆయన బీఆర్ఎస్ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఆ పార్టీ మునిగిపోతుందన్నారు.