Begin typing your search above and press return to search.

క‌విత డ‌బ్బా కొట్టుకోవ‌డం టూమ‌చ్ అంటున్న కోమ‌టిరెడ్డి

ఈ కామెంట్ల‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్ల‌మెంటు స‌భ్యురాలి క‌విత ఈ ర‌కంగా ప్ర‌చారం చేసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 3:25 PM GMT
క‌విత డ‌బ్బా కొట్టుకోవ‌డం టూమ‌చ్ అంటున్న కోమ‌టిరెడ్డి
X

మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ కేంద్ర నిర్ణ‌యం తీసుకోవ‌డం, త్వ‌ర‌లోనే పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్ట‌నుండ‌టం తెలిసిందే. అయితే, ఇదంతా త పోరాట ఫ‌లిత‌మేన‌ని అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొంటోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ క‌విత చేసిన ఆందోళ‌న వ‌ల్లేన‌ని ప్ర‌క‌టిస్తోంది. ఈ కామెంట్ల‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్ల‌మెంటు స‌భ్యురాలి క‌విత ఈ ర‌కంగా ప్ర‌చారం చేసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. గతంలో పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్ లేక‌పోయినా త‌న‌దే క్రెడిట్ అన్న‌ట్లుగా క‌విత ప్ర‌వ‌ర్తిస్తున్నారని సెటైర్ వేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ మహిళల గురించి ఆలోచించి వారిని కూడా చట్ట సభల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో మహిళా బిల్లును తీసుకువచ్చారని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తోందన్న ఆయన.. భారత రాష్ట్రపతిగా మహిళను నియమించడం అందుకు ఉదాహారణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ప్రభుత్వం వల్లే బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును పాస్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారని అందులో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్‌ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్‌ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్‌ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం కవిత ఎంపీగా లేరన్న ఆయన.. ఒకవేళ ఆమె ఎంపీగా లోక్‌సభలో ఉంటే తానే మహిళా బిల్లును పాస్‌ చేయించినట్లు డప్పు కొట్టకుంటూ చెప్పేవారన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే పార్లమెంట్‌లో మహిళా బిల్లు పాస్‌ అయిందని గొప్పలు చెప్పుకునేవారు ఇదే నిర్ణ‌యాన్ని త‌మ పాల‌న‌లో, ప్ర‌భుత్వంలో ఎందుకు అమ‌లు చేయ‌లేక‌పోయారో జ‌వాబు ఇవ్వాల‌ని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల ఫ‌లితంగా అభివృద్ధి సంక్షేమంలో భార‌త్ ముందంజ‌లో నిలుస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. రానున్న రోజుల్లో దేశం అగ్ర దేశాల సరసన నిలిచే అవకాశం ఉందని రాజ‌గోపాల్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌ విజయవంతం కావడంతో ప్రపంచం దృష్టి భారత్‌ వైపు మళ్లేలా చేసిందన్నారు. అంతే కాకుండా చంద్రయాన్‌-3 విజయవంతం ద్వారా భారత్‌ ఆగ్ర దేశాల మధ్య నిలిచిపోయిందని రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఏ దేశం చేయని విధంగా ఆదిత్యL1 ప్రయోగానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న రాజగోపాల్‌ రెడ్డి.. ఈ ఆపరేషన్‌ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇది విజయవంతంగా ముగిస్తే ఇండియా సూర్యుడిపై ప్రయోగాలు చేసిన మొదటి దేశంగా అవతరించనుందన్నారు.