Begin typing your search above and press return to search.

కేసీఆర్ పాపాలకు వర్షాలకు లింక్ ఏంటి కోమటిరెడ్డి అన్న

ప్రధానమంత్రి పాలనకు ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.

By:  Tupaki Desk   |   2 April 2024 10:09 AM GMT
కేసీఆర్ పాపాలకు వర్షాలకు లింక్ ఏంటి కోమటిరెడ్డి అన్న
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరుతుందని అంటే అందరు నవ్వుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుందని అంటున్నారు. ప్రధానమంత్రి పాలనకు ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ లు చేసి అందరిని మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్లది ట్యాపింగ్ ఫ్యామిలీగా అభివర్ణించారు. చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇప్పుడు కేటీఆర్ ఆ మాటలు అన్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. కేసీఆర్ పాలనకు తగిన బుద్ధి చెప్పారని చెప్పారు.

మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై చేస్తున్న వదంతులు సరైనవి కావన్నారు. వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునే క్రమంలో హరీష్ రావు ఇలాంటి అబద్ధాలు వళ్లించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ లో జోకర్ లా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నూరు శాతం మంచి పాలన అందిస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని వెల్లడించారు.

కేసీఆర్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. దీంతోనే రాష్ట్రంలో వర్షాలు పడలేదని గుర్తు చేశారు. అందుకే పంటలు ఎండిపోయాయన్నారు. అంతేకాని పంటలు ఎండిపోవడానికి తాము కారణం కాదని గుర్తు చేశారు. ఇదంతా ప్రజలు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. ప్రజాబలంతో పార్టీ ముందంజలో నిలుస్తుంది. బీజేపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ దేశంలో ప్రధాన భూమిక పోషించనుందన్నారు. దీని కోసమే కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించనుంది. ఈ మేరకు ప్రజల చెంతకు చేరేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.