కాళేశ్వరం కథ తేలుస్తాం: కోమటిరెడ్డి కామెంట్స్
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 27 April 2025 6:00 AM ISTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జలాలను అడ్డుపెట్టి కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మైండ్ ఉన్నోడు ఎవడైనా ముందుగానే కట్టుకుం టారా? అని ప్రశ్నించారు. తెలివి లేకనే పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని దుయ్యబట్టారు.
``కాళేశ్వరంలో అంతా మంచే జరిగిందని అబ్బా కొడుకులు చెబుతారు. మీరు చూడండి. రేపు ఏం జరు గుద్దో. కానీ.. కాళేశ్వరం కథేంటో అసలు ఏం జరిగిందోమేం త్వరలోనే తేలుస్తాం.`` అని కోమటిరెడ్డి అన్నా రు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ``నిధులన్నారు. నీళ్లన్నారు. నియామకాలన్నారు. ఇవన్నీ.. తెలంగాణ కోసమేనని నమ్మబలికారు. రాష్ట్రం వచ్చాక.. నిధులువారికే దక్కె. నియామకాలు కూడా వారికే దక్కె. నీళ్లు అడ్డుపెట్టుకుని ప్రాజెక్టుల పేరుతో బొక్కారు`` అని దుయ్యబట్టారు.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందన్న మంత్రి.. దీనిని చిన్న విషయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నార ని మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని చెప్పారు. వాటిలో నీళ్లు నింపితే ఈపాటికే మొత్తం కొట్టుకుపోయేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి తుమ్మిడిహట్టి సరైన ప్రాంతమని ఇంజినీర్లు చెప్పారని.. కానీ, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే.. కాంగ్రె స్ పార్టీకి మంచి పేరు వస్తుందన్న దుగ్ధతోనే.. కేసీఆర్.. దీనిని వదిలేశారని చెప్పారు. కాళేశ్వరం వల్ల బాగుపడింది.. కేసీఆర్ కుటుంబం మాత్రమేనని దుయ్యబట్టారు.
