జగన్ అలా చేస్తే బెటర్... కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో తెలంగాణా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
By: Satya P | 6 Dec 2025 4:00 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో తెలంగాణా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణాలో జరుగుతున్న సమ్మిట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబుని ఆహ్వానించడానికి అమరావతికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద ఏపీ రాజకీయాల మీద కీలక వ్యాఖ్యలే చేశారు. జగన్ కి ఒక మిత్రుడుగా కూడా సలహా ఇచ్చారు. జగన్ ఏపీ అసెంబ్లీకి వెళ్లాలని ఆయన కోరడం విశేషం.
అదే అసలైన వేదిక :
చట్ట సభలే అసలైన వేదిక అని కోమటి రెడ్డి అన్నారు. అక్కడ నుంచే ఏ అంశం అయినా ఎత్తి ప్రజా సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనవచ్చునని ఆయన చెప్పారు. ఈ విషయంలో జగన్ ఆలోచన చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి తరువాత విపక్ష నేతకే ఏ రాష్ట్రంలో అయినా అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తాము తెలంగాణా అసెంబ్లీలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా బీఆర్ఎస్ మీద అలుపెరగని పోరాటం చేశామని కోమటిరెడ్డి గుర్తు చేశారు. జగన్ సైతం అలా ప్రజా సమస్యల మీద మాట్లాడాలని కోరారు. విషయానికి వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ జగన్ కి సన్నిహితులు అన్న మాట కూడా ఉంది. వారితో దోస్తీ కూడా బాగానే ఉంటుంది అని అంటారు. అలాంటిది కోమటిరెడ్డి వంటి వారే జగన్ అసెంబ్లీకి వెళ్లాలని సూచించడం విశేషం.
బాబుకు పొగిడేశారు :
బాబు విజన్ కి హైదరాబాద్ ప్రతిరూపం అని కోమటి రెడ్డి చెప్పడం విశేషం. ఆయన ఈ మాట అనడానికి ఒక రోజు ముందే ప్రెస్ మీట్ పెట్టి జగన్ బాబు తెలంగాణాను హైదరాబాద్ ని వదిలేసి రెండు దశాబ్దాలు అయింది అని అయినా తన వల్లనే అంతా అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవడమేంటి ని సెటైర్లు వేశారు. కానీ తెలంగాణా మంత్రి స్వయంగా బాబు విజనరీ అంటూ హైదరాబాద్ కి ఆయన ఎంతో మేలు చేశారని చెప్పడం గమనార్హం.
పవన్ మీద కామెంట్స్ తో :
అదే విధంగా కోమటిరెడ్డి ఈ మధ్యనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ మీద సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వమని కూడా హెచ్చరించారు. ఆ మీదట జనసేన నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. దాంతో ఎండ్ కార్డు పడింది అని అంటున్నారు. ఇక కోమటిరెడ్డి ఏపీ మీడియాతో మాట్లాడుతూ అప్పటి పరిస్థితుల వల్లనే తాను అలా మాట్లాడాను అన్నారు. ఏది ఏమైనా ఏపీ తెలంగాణా ప్రజలు అంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరుకోవడం విశేషం. మొత్తానికి ఏపీకి కోమటిరెడ్డి వచ్చి ఇచ్చిన ప్రకటనలు కూటమికి ఖుషీగా ఉండగా వైసీపీకి జగన్ కి కొంత ఇరకాటంగా మారాయని అంటున్నారు.
