కోల్ కతా రే*ప్ కేసు... పోలీసులకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లో ఏముందంటే..?
జూన్ 25న పశ్చిమ బెంగాల్ లోని కస్బా ప్రాంతంలోగల సౌత్ కోల్ కతా లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించి అకృత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Jun 2025 12:19 AM ISTజూన్ 25న పశ్చిమ బెంగాల్ లోని కస్బా ప్రాంతంలోగల సౌత్ కోల్ కతా లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించి అకృత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గదిలోకి బాధితురాలిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది.
అవును... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఓ న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థినికి ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్ధరణకు వచ్చారు! ఈ సమయంలో కీలక దృశ్యాలు తెరపైకి వచ్చాయి!
ఇందులో భాగంగా... అత్యాచారం చేసేందుకు బాధితురాలిని క్యాంపస్ లోని గార్డ్ రూమ్ లోకి ఈడ్చుకెళుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా స్పందించిన పోలీసు అధికారి ఒకరు... ఈ ఘటనకు సంబంధించి ఆమె చేసిన ఆరోపణలను సీసీటీవీ ఫుటేజ్ నిర్ధారిస్తుందని.. ఆ ఫుటేజ్ ని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఆ ఫుటేజ్.. ముగ్గురు నిందితులు, సెక్యూరిటీ గార్డు, బాధితురాలి కదలికలను చూపిస్తుందని వెల్లడించారు. ఇదే సమయంలో... యూనియన్ గది, వాష్ రూమ్, గార్డు గది నుండి జుట్టు, హాకీ స్టిక్ వంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారని చెబుతున్నారు. వీటికి సంబంధించిన శాంపుల్స్ ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.
కాగా... విద్యార్థినికి ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్ధరణ అయ్యింది! ఈ సందర్భంగా స్పందించిన పోలీసు అధికారి ఒకరు... బాధితురాలి వ్యక్తిగత అవయవాలను గాయపరిచారని.. మెడ చుట్టూ, ఛాతీపై పంటి గాట్లు, గోళ్లతో గీరిన గాయాలయ్యాయని వెల్లడించారు!
తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రధాన నిందితుడు ప్లాన్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఓ పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్ స్టూడెంట్స్ తో పాటు సెక్యూరిటీ గార్డు ఉన్నారు.
