Begin typing your search above and press return to search.

కోకాపేట రేటు కేకోకేక... ఎకరం రేటెంతో తెలుసా?

హైదరబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ (హెచ్‌.ఎం.డీ.ఏ) మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 2:23 PM GMT
కోకాపేట రేటు  కేకోకేక... ఎకరం రేటెంతో తెలుసా?
X

కోకాపేట నియో పొలిస్ ఫేజ్-2 వేలంలో భూముల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. నియో పొలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికాయి. ఈ వేలం పాటల వల్ల హైదరబాద్ లో భూమి విలువ ఎలా ఉంది.. ముందు ముందు ఎలా ఉండబోతోందనేది తెలుస్తోందని అంటున్నారు.

అవును... కోకాపేట భూములు అంచనాలకు మించి పలుకుతున్నాయి. నిధుల సమీకరణలో భాగంగా హైదరబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ (హెచ్‌.ఎం.డీ.ఏ) మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. ఎక‌రం భూమికి క‌నీస ధ‌ర రూ. 35 కోట్లుగా హెచ్‌.ఎం.డీ.ఏ నిర్ణ‌యించింది.

అయితే హెచ్‌.ఎం.డీ.ఏ నిర్ణయించిన ధరకు రెంట్టింపు ధర పలకడం గమనార్హం. అవును... కోకాపేట భూముల్లోని నియోపోలీస్‌ లే అవుట్‌లోని 6,7,8,9 ప్లాట్లకు గురువారం వేలం వేసింది హెచ్‌.ఎం.డీ.ఏ. ఇందులో భాగంగా... తొమ్మిదో ప్లాట్‌ లోని 3.60 ఎకరాల భూమిలో.. ఎకరం రూ.76.5 కోట్లకు వేలం దక్కించుకుంది.

ఒక్క 9వ ప్లాట్‌ వేలంతోనే మొత్తంగా రూ.275.4 కోట్లు వచ్చాయి. ఇక 6,7,8 ప్లాట్‌ లలో ఈ-ఆక్షన్‌ కొనసాగుతోంది. గురువారం మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 18.47 ఎకరాల‌కు వేలం కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం నియో పోలిస్‌లో 10, 11, 14 ప్లాట్ల‌కు వేలం కొన‌సాగుతోంది.

ప్రస్తుతం కోటాపేట భూముల్లో.. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలు పలికింది. మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌ లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా... తొలి విడతలో 26 ఎకరాలకు పైగా భూమితో.. సుమారు 1,500 కోట్లకు పైగా సమీకరించుకోనుంది.