Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఫైనల్ ముందు.. అనుష్కతో డేటింగ్..తీవ్ర ఒత్తిడిలో కోహ్లి..

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. తాను ఏదైనా ఒక్కసారి నమ్మితే అంతే.. జీవితాంతం దానికే కట్టుబడి ఉంటాడు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 5:36 PM IST
ఐపీఎల్ ఫైనల్ ముందు.. అనుష్కతో డేటింగ్..తీవ్ర ఒత్తిడిలో కోహ్లి..
X

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. తాను ఏదైనా ఒక్కసారి నమ్మితే అంతే.. జీవితాంతం దానికే కట్టుబడి ఉంటాడు. దీనికి ఉదాహరణ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ప్రముఖ షాంపూ బ్రాండ్ హెడ్ అండ్ షోల్డర్స్.. అనుష్క శర్మ. కోహ్లి గురించి ప్రపంచానికి తెలియకముందే బెంగళూరు అతడిని ఐపీఎల్ లో తమ జట్టులోకి తీసుకుంది. ఆ గ్రాట్యుటీని కోహ్లి 18 ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు. ఇక తన చిన్ననాటి కోచ్ ల విషయంలోనూ అంతే ఉంటాడు. 22 ఏళ్ల వయసులో హెడ్ అండ్ షోల్డర్ షాంపూ యాడ్ చేస్తున్న సమయంలోనే నటి అనుష్కశర్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వచ్చింది.

అయితే, కోహ్లి అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవాడు. పైగా 17 ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు. అందరు ఢిల్లీ కుర్రాళ్లలాగే బాగా యాక్టివ్. ఈ నేపథ్యంలో క్రికెట్ లో ఎంత ముందకెళ్లగలడు? అనే అనుమానాలు ఉండేవి. అలాంటి సమయంలో అంతర్జాతీయ కెరీర్లో పూర్తిగా కుదురుకోకుండానే అనుష్క శర్మతో ప్రేమాయణం మొదలైంది.

2014 నాటికి కోహ్లి టీమ్ ఇండియాలో స్థిరపడ్డాడు. కానీ, ఆ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. అప్పటికి స్నేహితురాలిగా ఉన్న అనుష్కశర్మను తనవెంట తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడు. ఎవరూ ఊహించని స్థాయిలో ఫిట్ నెస్ మెరుగుపర్చుకుని గొప్ప బ్యాట్స్ మన్ గా అవతరించాడు.

తాజాగా 3.40 నిమిషాల ఓ యాడ్ లో కోహ్లి-అనుష్క నటించారు. విలాసవంతమైన దుబాయ్ బిల్డింగ్..దానిపైన ఉండే స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరూ జలకాలాటలు.. డైలీ లైఫ్.. ఇలా ఎన్నో సంగతులు ఈ యాడ్ లో ఉన్నాయి. ఇదే సమయంలో అతిథుల్లో ఓ ప్రేమికుల జంట కనిపిస్తుంది. వారి రిలేషన్ షిప్ గురించి కోహ్లి-అనుష్క మాట్లాడుకుంటూ వస్తారు. ఆ అబ్బాయి ఆందోళనలో ఉన్నట్లు కోహ్లి చెబుతాడు. గతంలో అనుష్కతో రిలేషన్ లో ఉన్నప్పుడు తాను కూడా ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తుచేసుకుంటాడు. బహుశా ఈ సమయం 2014 ఇంగ్లండ్ టూర్ లో అయి ఉండొచ్చు. లేదా కెరీర్ లో కుదురుకునే సమయంలో కావొచ్చు.

కోహ్లి-అనుష్క 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు వామిక కాగా.. అబ్బాయి అకాయ్. పెళ్లి తర్వాత అనుష్క పెద్దగా సినిమాలు చేయడం లేదు. 2018లో షారూక్ ఖాన్ తో జీరో సినిమాలో మాత్రమే నటించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మంగళవారం జరగనుండగా.. ఆర్సీబీ తొలిసారి చాంపియన్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తుండగా.. విరాట్ కోహ్లి తాను గతంలో ఒత్తిడి ఎదుర్కొన్న సందర్భాన్ని ప్రస్తావించడం గమనార్హం.