కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై కీలక సమాచారం!
తీవ్ర అనారోగ్యంతో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానీని కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 April 2025 2:51 PM ISTతీవ్ర అనారోగ్యంతో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానీని కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ సమయంలో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై కీలక సమాచారం తెరపైకి వచ్చింది.
అవును... గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ట్రీట్ మెంట్ చేయగా.. ఆయనకు గుండెలోనూ సమస్య ఉన్నట్లు తేల్చారనే నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ మూసుకుపోయాయని.. వాటికి స్టంట్స్ వేయగడం కానీ, హార్ట్ సర్జరీ చేయడం కానీ చేయాల్సి ఉందని అన్నారు!
ఈ సమయంలో ముంబైలోని ఆస్పత్రికి సోమవారం కుటుంబ సభ్యులు, వైద్యుల పర్యవేక్షణలో తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబైలో చికిత్స పొందుతున్నారు. నివేదికల ప్రకారం.. ఆయనకు ఇప్పటికే శస్త్ర చికిత్స జరిగిందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారని.. మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కొడాలి నాని టీమ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని... ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా... ఆయన ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండని తెలిపారు.
అయితే.. ఇంతలోనే ఆయనను మెరుగైన చికిత్స కోసమని ముంబైకి తరలించాల్సి రావడంతో అభిమానుల్లోనూ, కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొందని అంటున్నారు. అయితే... తాజా నివేదికల ప్రకారం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.
కాగా... వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని.. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక 2004 నుంచి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ, వైసీపీ తరుపున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
