కేకే కుమారుడికి వేధింపులా !?
తాజాగా కేకే కుమారుడు వెంకటేశ్వరరావు.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సిద్దిపేటలోని తనకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించారని..
By: Garuda Media | 7 Feb 2026 4:15 PM ISTకేకే.. కే. కేశవ్‌రావు.. ఈ పేరు తెలియని తెలంగాణ నేతలు ప్రజలు కూడా ఉండరు. సుదీర్ఘకాలంగా రాజకీ యాల్లో ఉన్న కే కేశవరావు.. బీఆర్ ఎస్ హయాంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ హయాంలో ఆయన పార్టీ మారారు. ఇక, జీహెచ్ ఎంసీ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి.. కేకే కుమార్తె కావడం మరో విశేషం. ఇంత ప్రొఫైల్ ఉన్న కేకే కుటుం బం.. వేధింపులకు గురి అవుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
తాజాగా కేకే కుమారుడు వెంకటేశ్వరరావు.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సిద్దిపేటలోని తనకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించారని.. దీని నుంచి వెళ్లిపోవాలని అంటే.. తనను బెదిరిస్తున్నా రని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. డబ్బుల కోసం తనను వేధిస్తున్నారని కూడా పేర్కొన్నారు. వీరిలో గడీల రఘువీర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఉన్నారని తెలిపారు. తమ భూములను వారు కబ్జా చేశారని ఆరోపించారు. దీనిలోనుంచి వెళ్లిపోవాలని కోరిన తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలి పారు.
మొత్తంగా ఈ కేసు వ్యవహారం ఎలా ఉన్నా.. రాష్ట్రంలో నివాస యోగ్య స్థలాలను కబ్జా చేస్తున్న ముఠాల వ్య వహారం చర్చకు వస్తోంది. పెద్ద పెద్ద నాయకుల నివాస స్థలాలే కబ్జాకు గురవుతున్నాయన్న వాదన బలం గా వినిపిస్తోంది. అంతేకాదు.. కేకే కుమారుడి వ్యవహారం వెలుగు చూడగానే అధికారులు సైతం నివ్వెర పోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కాకరేపుతోంది. దీనిపై సర్కారుఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి. ప్రస్తుతం కేకే కూడా ఆవేదనలో ఉన్నారు. తమ కుమారుడికే కష్టం వచ్చిందని.. ఆయన పలువురు నాయకులకు చెబుతున్నారట.
