Begin typing your search above and press return to search.

కిష‌న్‌రెడ్డి కామెడీ...కేసీఆర్ అవినీతిపై విచార‌ణ‌లో కొత్త ట్విస్ట్‌

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అదే కేసీఆర్ అవినీతి. దానిపై బీజేపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం!

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:00 AM GMT
కిష‌న్‌రెడ్డి కామెడీ...కేసీఆర్ అవినీతిపై విచార‌ణ‌లో కొత్త ట్విస్ట్‌
X

తెలంగాణలో అధికారం సొంతం చేసుకుంటుందా అనే అంచ‌నాల నుంచి ప్ర‌స్తుత పోటీలో ఆ పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనేలా బీజేపీ గ్రాఫ్ ఎంత వేగంగా పడిపోతోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఉన్న స్థితి నుంచి ఇప్పుడు ఆ పార్టీకి నుంచి రోజుకో నేత గుడ్ బై చెప్పే వ‌ర‌కు సీన్ మారిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అదే కేసీఆర్ అవినీతి. దానిపై బీజేపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం!

బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని సీఎం చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకమన్నారు. "ఇది సామాజిక విప్లవంతో కూడిన నిర్ణయం. అనేక సంవత్సరాలుగా బీసీలకు సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు జరిగాయి. కానీ అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు బీసీలను మోసం చేశాయి. తెలంగాణలో బీసీని సీఎం చేయాలని బీజేపీ నిర్ణయించడంపై గ్రామాల్లో కూడా బీసీ సామాజిక వర్గ ప్రజలు, సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశాయి. జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే" అని తెలిపారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని, కాని బీజేపీ మాట ఇస్తే తప్పే పార్టీ కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా సకలజనుల పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, బీఆర్ఎస్ను ఫామ్ హౌస్లోనే పాతరేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబ అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. గ్రామ పంచాయతీ నుంచి మొదలు సీఎంవో వరకు అవినీతిని అంతం చేస్తామని చెప్పారు. అక్రమ వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపుతామని, హైదరాబాద్ లో మాఫియాను యూపీలో యోగి ప్రభుత్వం మాదిరిగా బుల్డోజర్లతో అణచివేస్తామని హెచ్చరించారు.