బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి ?
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే ఎంతో విలువైనది. మరెంతో బాధ్యత కలిగినది.
By: Tupaki Desk | 31 March 2025 7:00 PM ISTభారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే ఎంతో విలువైనది. మరెంతో బాధ్యత కలిగినది. అటల్ బిహారీ వాజ్ పేయి ఎల్కే అద్వానీ సుదీర్ఘకాలం ఈ కీలక స్థానంలో ఉన్నారు. పార్టీని జీరో నుంచి హీరో స్థాయికి తెచ్చారు. ఇక బీజేపీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వారిలో అతిరధ మహారధులు ఎందరో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి బంగారు లక్ష్మణ్, ఎం వెంకయ్యనాయుడు ఈ పదవిని చేపట్టారు. ఇప్పుడు వారి తరువాత మూడవ తెలుగు నాయకుడిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఉండబోతున్నారు. ఆయన విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు దాదాపుగా ఆమోదముద్ర వేశారు అని అంటున్నారు.
కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అవడానికి అనుకూలతలు ఏమిటి అంటే ఆయన సౌత్ స్టేట్ కి చెందిన వారు. అందునా తెలంగాణ వాసి. బీజేపీకి సౌత్ స్టేట్స్ మీద ఆశ ఉంది. పార్టీని అక్కడ విస్తరించాలని కోరిక ఎంతో ఉంది. ఇక తెలంగాణాలో తరువాత వచ్చేది తామే అన్న ఆలోచన నమ్మకం ఉంది.
దాంతో అక్కడ నుంచే జాతీయ నాయకత్వాన్ని తీసుకుని వస్తే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని లెక్క ఉంది. కిషన్ రెడ్డి విషయం తీసుకుంటే ఆయన నరేంద్ర మోడీకి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. కేంద్ర మంత్రిగా ఆయన దాదాపుగా పదేళ్ళుగా పనిచేస్తున్నా కూడా ఎక్కడా అవినీతి మచ్చ అంటని నాయకుడిగా ఉన్నారు. అంతే కాదు ఆయన నిజాయతీగా నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తారు అని అంటున్నారు.
హిందీ ఇంగ్లీష్ భాషలలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. బీజేపీలో అట్టడుగు నుంచి వచ్చిన నేత. ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. దాంతో అక్కడ నుంచి కూడా ఆమోదం ఉంది అని అంటున్నారు. కొత్త బీజేపీ ప్రెసిడెంట్ కి ఆరెస్సెస్ మూలాలు ఉండాలన్న సంఘ్ పరివార్ ఆశలకు తగినట్లుగా కిషన్ రెడ్డి అభ్యర్ధిత్వం ఉందని అంటున్నారు.
ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల మీద జాతీయ రాజకీయాల మీద కూడా తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు అని అంటున్నారు. ఆయన కొత్త పదవిలో కుదురుకుంటున్నారు. కాబట్టే జాతీయ రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.
ఇటీవల ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డికి కాబోయే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఆసక్తిగా ఉంది. దేవుడికి కూడా తెలియదు అని. ఎందుకంటే తమది వారసత్వ పార్టీ కాదు కాబట్టి ఎవరైనా ఆ పదవిలోకి రావచ్చు అన్నది కిషన్ రెడ్డి చెప్పిన సారాంశం. ఇపుడు ఆ దేవుడే శాసిస్తున్నాడులా ఉంది అని అంటున్నారు
అందుకే కిషన్ రెడ్డి అతి తొందరలోనే బీజేపీకి జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారు అని అంటున్నారు. కిషన్ రెడ్డి డైనమిక్ లీడర్ గా ఉన్నారు. దాంతో ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. వారి నుంచి జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే అది బీజేపీకి ఎంతో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఓ ఏఅదైనా చివరి నిముషంలో మార్పు కనుక సంభవించకపోతే మాత్రం జి కిషన్ రెడ్డి బీజేపీకి కొత్త అధ్యక్షుడు అవడం ఖాయం అంటున్నారు.
