Begin typing your search above and press return to search.

రైలు ఎక్కిన కిమ్‌... రష్యాలో కొంపముంచే ప్లాన్స్ ఏమిటో?

ఈ సమయంలో వాటిని నిజం చేస్తూ.. కిమ్‌ రైల్లో రష్యాకు బయలుదేరారని, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి ఆదివారం

By:  Tupaki Desk   |   11 Sep 2023 2:27 PM GMT
రైలు ఎక్కిన కిమ్‌... రష్యాలో కొంపముంచే ప్లాన్స్  ఏమిటో?
X

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం విషయంలో అగ్రరాజ్యం సహా జీ-20 దేశాలు ఈ యుద్ధం విషయంలో రష్యా వైఖరిని తప్పుబడుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌.. రైలు ఎక్కి రష్యా బయలుదేరారని తెలుస్తుంది.

అవును... రష్యా – ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఉక్రెయిన్‌ తో యుద్ధం జరుపుతోన్న రష్యా, ఆయుధాలను సమీకరించే ప్రయత్నం చేస్తోందనే కథనాలొస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో కిమ్‌.. రష్యా బయలుదేరి వెళ్లారని అంటున్నారు.

గతకొన్ని రోజులుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో కిమ్‌ భేటీ కానున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వాటిని నిజం చేస్తూ.. కిమ్‌ రైల్లో రష్యాకు బయలుదేరారని, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి ఆదివారం సాయంత్రమే కిమ్‌ కి చెందిన విలాసవంతమైన రైలు రష్యాకు బయలుదేరిందని దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది.

దీంతో ఆయుధాలను సమీకరించే ప్రయత్నం చేస్తోన్న రష్యాకు సహాయం అందించే విషయంలో పుతిన్ తో చర్చించేందుకే కిమ్‌ రష్యా ప్రయాణం అని అమెరికా నిఘావర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని.. ఆయుధాల విక్రయంపై చర్చలు జరిపారని తెలిపాయి.

అయితే ఈ విషయంలో మీడియా కథనాలు మినహా... అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం, రక్షణశాఖ లేదా అక్కడి నిఘా వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో ఈ భేటీపై రష్యా నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని చెబుతున్నారు!

ఇప్పటికే అత్యంత ప్రమాదకరమైన అణు ఆయుదాలను కిం మిగిలినవారికంటే ఎక్కువగా అనధికారికంగా కలిగిఉన్నారనే కథనాలు అంతర్జాతీయ మీడియాల్లో వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ భేటీ అనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి... ఉక్రెయిన్ పరిస్థితి ఎలా మారబోతోంది అనేది చర్చనీయాంశం అయ్యింది.

కాగా... 2019లోనే ఒకసారి ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్తోక్‌ లో రష్యా అధ్యక్షుడితో కిమ్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కూడా విలాసవంతమైన రైలులో 20 గంటలు ప్రయాణించిన కిమ్‌... వ్లాదివోస్తోక్‌ నగరానికి చేరుకున్నారు.