కిమ్ మరీ ఇంత దుర్మార్గుడా..?
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు! తాను ఏమి చేసినా సంచలనమే అంటారు.
By: Tupaki Desk | 20 July 2025 11:00 AM ISTఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు! తాను ఏమి చేసినా సంచలనమే అంటారు. ప్రధానంగా తన రాజ్యం, రాజ్యాధికారం, తన ప్రాణం, తన పంతం విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అత్యంత షాకింగ్ గా ఉంటాయని చెబుతారు. చరిత్రలో ఎంతో మంది నియంతలు ఉన్నా.. ఈ రోజుల్లో కూడా తన నియంతృత్వాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించడం వెనుక చాలా నియంతృత్వ మస్తిష్కం ఉందని చెబుతారు.
అవును... తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి కిమ్ ఎంతకైనా తెగిస్తారని అంటారు. తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు అయినా చేస్తారని చెబుతారు. తన పంతం కోసం ఎలాంటివారితోనైనా స్నేహం, శత్రుత్వం మెయింటైన్ చేస్తారని అంటారు. ఇక తన ప్రాణం విషయానికొస్తే.. దాని కోసం ఎన్ని ప్రాణాలు బలిపెట్టడానికైనా వెనుకాడరని అంటారు. ఈ సమయంలో ట్రంప్ తాజా నిర్ణయం సంచలనంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే... కిమ్ జోంగ్ ఉన్ మద్యానికి, సిగరెట్లకు బానిసైపోయాడని.. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాడని.. ఫలితంగా 140 కేజీల వరకు బరువు పెరిగి ఉండొచ్చని గతంలో అమెరికాకు చెందిన ఓ పత్రిక పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా కిమ్ బరువు తగ్గాలనుకోవడం గురించి అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అతడు తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న మార్గాలపై షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది.
ప్రస్తుతం కిమ్ తన బరువు తగ్గించుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నానికైనా, ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో... తనను సన్నగా మార్చే, ఊబకాయం తగ్గడానికి ఉపయోగించే ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నాయో వెతకాలంటూ తన సన్నిహితులను ఆదేశించినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ సమయంలో వారు అలాంటి మందులు కొన్నింటిని గుర్తించినట్లు చెబుతున్నారు.
అంతవరకూ చేస్తే ఇక కిమ్ కూ మిగిలినవారికీ తేడా ఏముంటుంది? ఇక్కడే కిమ్ లో ఉన్న కిమ్ బయటకు వచ్చాడు. ఆ మందులను ఆయన నేరుగా వాడరట. ఆయన మాదిరే శరీరాకృతి, బరువు, మెడికల్ హిస్టరీ ఉన్నవారిపై తొలుత ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. అంటే... కొత్త కొత్త వ్యాక్సిన్లు కనిపెట్టినప్పుడు తొలుత ఎలుకలు, కోతులపై ప్రయోగిస్తారని అంటారు కదా! ఆ టైపులో అన్నమాట! దీంతో.. ఈ విషయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది!
గతంలో కిమ్ తండ్రి కూడా నొప్పి నివారించే మందులను తన సహాయకులకు ఇంజెక్ట్ చేశారని చెబుతున్నారు. పైగా... కిమ్ తండ్రి, తాత గుండె సంబంధిత సమస్యలతోనే ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ ఆందోళనలతోనే కిమ్ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు.
