Begin typing your search above and press return to search.

విషాదం... టెక్సాస్‌ లో ఖమ్మం టెక్కీ మృతి!

ఈ క్రమంలో తాజాగా మళ్లీ టెక్సాస్‌ లో ఓ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసింది ఓ ఘోర రోడ్డు ప్రమాదం.

By:  Tupaki Desk   |   9 Jan 2024 6:24 AM GMT
విషాదం... టెక్సాస్‌  లో ఖమ్మం టెక్కీ మృతి!
X

ఇటీవల కాలంలో విదేశాల్లో జరుగుతున్న వివిద ప్రమాదాల్లో మరణిస్తున్న తెలుగు వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కదిలిస్తుంది. ఇందులోనూ ప్రధానంగా ఒక్క టెక్సాస్‌ లోనే సుమారు ఆరుగురు తెలుగు వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న రోడ్డు ప్రమాదాలు తెలుగు సమాజాన్ని కదిలించి వేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ టెక్సాస్‌ లో ఓ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసింది ఓ ఘోర రోడ్డు ప్రమాదం.

అవును... అమెరికాలోని టెక్సాస్‌ లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి రాజీవ్‌ రెడ్డి(28) మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్‌ కు చెందిన ముక్కర భూపాల్‌ రెడ్డి కుమారుడు సాయి రాజీవ్‌ రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజీవ్ టెక్సాస్ విమానాశ్రయం నుంచి పార్శిల్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... టెక్సాస్ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయి రాజీవ్‌ రెడ్డి... పార్సిల్‌ తీసుకోవడానికి ఇంటి నుంచి తన కారులో విమానాశ్రయానికి వెళ్లారు. ఈ సమయంలో పార్సిల్ తీసుకుని తిరిగి వస్తుండగా ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది! ఈ ఘటనలో సాయి రాజీవ్ తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంతనే సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సాయి రాజీవ్‌ రెడ్డి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇందులో భాగంగా... సాయి రాజీవ్ మృతి చెందిన విషయం ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖమ్మంలోని కుటుంబ సభ్యులకు తెలిసింది! దీంతో తండ్రి భూపాల్‌ రెడ్డి సోమవారం అమెరికా ప్రయాణమయ్యారని తెలుస్తుంది.

కాగా కల్లూరు షుగర్‌ ఫ్యాక్టరీ సీడీసీ చైర్మన్‌ గా ఉన్న భూపాల్‌ రెడ్డి కుమారుడు రాజీవ్‌ ఐదేళ్లుగా అమెరికాలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందటే పెళ్లిచేసుకున్న అతను నాలుగు నెలల క్రితమే భార్యను తన వెంట తీసుకెళ్లాడు. ఇంతలోనే ఈ పెను విషాదం చోటు చేసుకుంది.