Begin typing your search above and press return to search.

ట్రంప్‌ను కెలికేసిన ఖామెనీ.. మరో యుద్ధం తప్పదా?

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న 'కోల్డ్ వార్' ఇప్పుడు వేడిెక్కింది.

By:  A.N.Kumar   |   17 Feb 2026 10:00 PM IST
ట్రంప్‌ను కెలికేసిన ఖామెనీ.. మరో యుద్ధం తప్పదా?
X

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న 'కోల్డ్ వార్' ఇప్పుడు వేడిెక్కింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖామెనీ నేరుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ చేపట్టిన క్షిపణి విన్యాసాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాయి.

ఖామెనీ సవాల్.. సముద్ర గర్భంలోకి యుద్ధనౌకలు

అమెరికా తన అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను యుద్ధ విమాన వాహక నౌకలు పంపి ఇరాన్‌ను బెదిరించాలని చూడటంపై ఖామెనీ తీవ్రంగా స్పందించారు. వాళ్లు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పంపామని చెబుతున్నారు. అది ప్రమాదకర ఆయుధమే కావచ్చు.. కానీ ఆ భారీ యుద్ధ నౌకను కూడా నిలువునా ముంచి, సముద్ర గర్భంలోకి పంపగల ఆయుధం మా వద్ద ఉంది. అది అంతకంటే ప్రమాదకరమైనది అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక 'యాంటీ షిప్ మిస్సైల్' సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.

హోర్ముజ్ జలసంధి.. ప్రపంచం గొంతుక ఇక్కడే ఉంది!

ఇరాన్ తన శక్తి ప్రదర్శన కోసం ఎంచుకున్న వేదిక 'హోర్ముజ్ జలసంధి'. ఇది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడు వంటిది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో 20% ఈ ఇరుకైన మార్గం గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే లేదా ఇక్కడ యుద్ధం సంభవిస్తే, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకుతాయి. జెనీవాలో అణు చర్చలు జరగడానికి కొద్ది గంటల ముందే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇక్కడ లైవ్ మిస్సైల్ ఫైరింగ్ నిర్వహించడం, అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంగా కనిపిస్తోంది.

ట్రంప్‌ను కెలకడం అవసరమా? వ్యూహం వెనుక అసలు కథ!

డొనాల్డ్ ట్రంప్ వంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడిని ఇరాన్ ఎందుకు రెచ్చగొడుతోంది? దీని వెనుక బలమైన దౌత్యపరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టే లోపే, తాము బలహీనంగా లేమని నిరూపించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. జెనీవా చర్చల్లో తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయించుకోవడానికి 'శక్తి ప్రదర్శన'ను ఒక ఆయుధంగా వాడుతోంది. మా జోలికి వస్తే ప్రపంచ చమురు సరఫరాను అస్తవ్యస్తం చేస్తాం" అని ఇరాన్ పరోక్షంగా ప్రపంచ దేశాలకు సంకేతాలిస్తోంది.

భారత్‌పై ప్రభావం ఎంత?

చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది ఆందోళనకరమైన విషయం. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే మన దేశంలో ఇంధన ధరలు పెరగడమే కాకుండా రూపాయి విలువ క్షీణించే ప్రమాదం ఉంది.

యుద్ధమా? శాంతి చర్చలా?

అంతర్జాతీయ రాజకీయాల్లో కొన్నిసార్లు "యుద్ధం చేయకూడదనే ఉద్దేశంతోనే.. యుద్ధానికి సిద్ధమయ్యామని" చూపిస్తుంటారు. ఇరాన్ చేస్తున్నది కూడా అదే అనిపిస్తోంది. అయితే ట్రంప్ యంత్రాంగం దీనికి ఎలా స్పందిస్తుందనే దానిపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మాటల యుద్ధం కాస్తా చేతల యుద్ధంగా మారితే.. అది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోదు. ప్రపంచ ఆర్థిక వినాశనానికి దారితీస్తుంది.