కేతిరెడ్డి ఎంట్రీ.. పోలీసులకు పనే.. !
అయితే.. తాజాగా హైకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డి.. కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకో గలిగారు.
By: Tupaki Desk | 3 May 2025 4:23 PM ISTఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గత ఏడాది ఎన్ని కల అనంతరం.. చోటు చేసుకున్న పరిణామాలు.. మధ్యలో జరిగిన రాజకీయ దుమారం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని.. పోలీసులు ఇక్కడ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నియోజక వర్గం నుంచి బహిష్కరణ వేటు వేశారు. దీంతో దాదాపు 7-8 మాసాలుగా కేతిరెడ్డి హైదరాబాద్ లో ఉంటు న్నారు.
ఏదైనా అవసరమై.. ఆయన నియోజకవర్గానికి రావాలని అనుకున్నా ముందుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప ర్మిషన్ తీసుకుని అవసరమైన పనులు చక్కబెట్టుకుంటున్నారు. మళ్లీ ఆవెంటనే ఆయన నియోజక వర్గం వీడి వచ్చేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలో చేసిన సవాళ్లు.. జేసీ బ్రదర్స్‌వర్సెస్ కేతిరెడ్డికి మధ్య ఉన్న పొలిటికల్ వైరల్ కారణంగా.. అనేక సందర్బాల్లో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీంతో పోలీసులు ఆయనను బయటకు పంపించారు.
అయితే.. తాజాగా హైకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డి.. కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకో గలిగారు. నియోజకవర్గంలో నివసించేందుకు.. అక్కడ నుంచే రాజకీయాలు చేసుకునేందుకు హైకోర్టు పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఎదురు చూసిన కేతిరెడ్డి అభిమానులు.. సంబరా లు చేసుకుంటున్నారు. అయితే.. ఇవి కూడా టీడీపీ నాయకులను కవ్వించేలా ఉంటున్నాయన్న విమ ర్శలు వస్తున్నాయి.
అంటే.. కేతిరెడ్డి ఎంట్రీతో మళ్లీ తాడిపత్రి రాజకీయాలు తాటతీసే స్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గం లో ఆయన ఎంట్రీ తో మరిన్నిఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో తాజాగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. ఇక, కేతిరెడ్డి ఎంట్రీ నేపథ్యంలో నిలువెత్తు ఫ్లెక్సీలను అభి మానులు ఏర్పాటు చేశారు. అయితే.. ఈ పరిణామాలను జేసీ వర్గీయులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగానే ఉంది.
