Begin typing your search above and press return to search.

ఫ్యూచర్ చెబుతున్న కేతిరెడ్డి... ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్!

ఇందులో భాగంగా తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

By:  Tupaki Desk   |   27 Dec 2023 12:54 PM GMT
ఫ్యూచర్  చెబుతున్న కేతిరెడ్డి... ప్రత్యర్థులపై హాట్  కామెంట్స్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాడిపత్రి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా... అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఘాటు విమర్శలూ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇరువురు నేతల సవాళ్లతో తాడిపత్రిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అవును... తాడిపత్రిలో రాజకీయాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న చందంగా మారిపోయిన సంగతి తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతీసారీ ఇద్దరు నేతలూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అధికారంలోకి వచ్చినా, రాకపోయినా నాలుగు నెలల్లో తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మరో నాలుగు నెలల తర్వాత తన అసలు రూపం చూస్తారని, ఫ్యాక్షన్ ని మళ్లీ మొదలు పెడతానని చెబుతూ పరోక్షంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... తన ప్రత్యర్థులను వదిలి ప్రసక్తే లేదని కేతిరెడ్డి తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో... పంటకు చీడపురుగు ఎంత ప్రమాదమో రాజకీయాల్లో కూడా చీడ పురుగు అంతే ప్రమాదమని, ఆ చీడ పురుగులను కచ్చితంగా ఏరి వేస్తానని కేతిరెడ్డి అన్నారు. ఇదే సమయంలో... తాడిపత్రిలో ముప్పై సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగుతోందని.. అది చూడలేకే తాను ఎదురు తిరిగే పరిస్థితులు నెలకొన్నాయని.. రాజకీయాల్లో అడ్డదారులు తొక్కేవారిని వదిలిపెట్టను అని సంచలన వ్యాఖ్యలు చేశారు!

అనంతరం... తనపై కరపత్రాలు వేసి జేసి ప్రభాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన కేతిరెడ్డి... తాను సంపాదించిన ప్రతి ఒక్కటి సక్రమమేనని అన్నారు. జేసి ప్రభాకర్ రెడ్డి అవినీతిపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారని, ఆయన అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం అని స్పష్టం చేశారు. కేతిరెడ్డి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సీమలో హాట్ టాపిక్ గా మారాయి!