Begin typing your search above and press return to search.

కేశినేని నాని సీట్ సేఫ్...!

పైపెచ్చు కేశినేని నానికి ఎంపీ సీటు తప్పిస్తే ఆయన కుమార్తె కేశినేని శ్వేతకు ఇవ్వాల్సింది మైలవరం సీటు ని ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:22 PM GMT
కేశినేని నాని సీట్ సేఫ్...!
X

వైసీపీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఆరవ జాబితాను చూస్తే విజయవాడ సిట్టింగ్ ఎంపీ వైసీపీలో రీసెంట్ గా చేరిన కేశినేని నాని ఎంపీ సీటు సేఫ్ అని అంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మార్పుచేర్పులలో మైలవరం ఎమ్మెల్సే వసంత వెంకట క్రిష్ణ ప్రసాద్ సీటు ఎగిరిపోయింది. ఆయన ప్లేస్ లో తిరుపతిరావు అనే బీసీకి ఇక్కడ టికెట్ ని వైసీపీ హై కమాండ్ కన్ ఫర్మ్ చేసింది.

దాంతో అదే సామాజికవర్గానికి చెందిన కేశినేని నాని ఎంపీ సీటుని ఎక్కడా కదిపే ప్రయత్నం చేయబోరని అంటున్నారు. పైపెచ్చు కేశినేని నానికి ఎంపీ సీటు తప్పిస్తే ఆయన కుమార్తె కేశినేని శ్వేతకు ఇవ్వాల్సింది మైలవరం సీటు ని ప్రచారం సాగింది. ఇపుడు అక్కడ వేరే అభ్యర్ధిని పెట్టారు కాబట్టి కేశినేని విజయవాడ ఎంపీగా ఉంటారు అని అంటున్నారు.

కేశినేని నాని వంటి అంగబల అర్దబలం ఉన్న అభ్యర్ధి అయితేనే బాగుంటుంది కలసి వస్తుందని ఎమ్మెల్యేలు కూడా చెప్పడంతోనే ఈ మార్పు అని అంటున్నారు. పైగా టీడీపీని చంద్రబాబుని చినబాబుని నిలవరించాలంటే కేశినేని నాని ఎంపీ అభ్యర్ధిగా ఉంటేనే సో బెటర్ అని కూడా ఆలోచించారు అని అంటున్నారు

ఇంకో వైపు నుంచి చూస్తే పార్టీలో చేరిన వెంటనే కండువా కప్పి టికెట్ అనౌన్స్ చేసిన వైసీపీ ఇపుడు మార్పు చేర్పులలో వెనక్కి తీసుకోవడం భావం కాదని ఈ మార్పుతో చాలా చోట్ల ఆ ప్రభావం పడుతుందని అంచనా వేశారుట. ఇక అన్నీ ఆచీ తూచీ ఇంచార్జిలను నియమిస్తే ఇపుడు కొన్ని చోట్ల మార్చుకుంటూ పోతూంటే అది టోటల్ గా మొత్తానికి మొత్తం మార్చే విధంగా కూడా దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు.

అదే విధంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా మైలవరం అభర్ధితో సరిపోయింది కాబట్టి విజయవాడ ఎంపీ సీటు దాకా రావడం మానుకున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పరిణామాలు అన్నీ కేశినేని నాని రాజకీయ ఇమేజ్ ని బాగా కాపాడాయని అంటున్నారు. లేకపోతే కేశినేని నానిని ఫుల్ లెవెల్ లో ర్యాగింగ్ చేయ్డానికి టీడీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు.