Begin typing your search above and press return to search.

బీజేపీలోకి కేశినేని... రీజ‌న్లు ఇవే... !

వాస్త‌వానికి.. అప్ప‌ట్లో బీజేపీతో టీడీపీ వైరం కొన‌సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం నాని వైఖ‌రిపై హ‌ర్ట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 4:11 AM GMT
బీజేపీలోకి కేశినేని... రీజ‌న్లు ఇవే... !
X

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. త్వ‌ర‌లోనే టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. ఆయనను ఏ పార్టీ చేర్చుకుంటుంద‌నేది ఆసక్తిగా మారింది. గ‌తంలో రెండోసారి ఎంపీగా గెలిచిన త‌ర్వాత‌.. ఎంపీ నాని.. నేరుగా బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లుసుకున్నారు. అప్ప‌ట్లోనే ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌నే చ‌ర్చ సాగింది. అయితే.. దీనిపై అప్ప‌ట్లో ఇటు బీజేపీ కానీ, అటు నాని కానీ.. రియాక్ట్ కాలేదు.

వాస్త‌వానికి.. అప్ప‌ట్లో బీజేపీతో టీడీపీ వైరం కొన‌సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం నాని వైఖ‌రిపై హ‌ర్ట్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. నాని మాత్రం త‌న దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. త‌న కుటుంబంతో క‌లిసి.. ప్ర‌ధాని మోడీతో భేటీ కావ‌డం.. త‌ర్వాత మ‌రోసారి నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లుసుకోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు ఆయ‌న టీడీపీకి దూర‌మైతే.. ఎటు వెళ్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో వ్యాపారాలు, ఇత‌ర‌త్రా విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కేశినేని చూపు బీజేపీవైపు ఉంద నే చ‌ర్చ సాగుతోంది. పైకి.. ఆయ‌న‌వైసీపీ నాయ‌కుల‌తో క‌లివిడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం బీజేపీ వైపు ఆయ‌న ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసిన త‌ర్వాత‌.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. గెలిస్తే.. బీజేపీలోకి వెళ్ల‌డంత‌ద్వారా.. కేంద్రంలో త‌న‌కు ప‌నులు చేయిం చుకోవ‌డం ఒక వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఇలా కాదంటే.. మ‌రోవైపు, నేరుగా బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం అనే ఆలోచ‌న దిశ‌గానే కేశినేని వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఇక్క‌డ ఇమ‌డ‌గ‌లిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర‌స్థాయిలో ఆయ‌న రాజ‌కీయాలు చేయాల‌ని లేద‌ని.. కేంద్రం స్థాయిలోనే ఆయ‌న జాతీయ రాజ‌కీయా లు చేయాల‌ని భావిస్తున్నార‌ని.. త‌నంత‌ట తానుగా ఇండిపెండెంట్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చూస్తున్నార‌ని కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. బీజేపీ వైపే కేశినేని నాని దృష్టి ఉంద‌ని మెజారిటీ అభిప్రాయంగా ఉంది.