మాజీ ఎంపీ డెసిషన్: నేను కాదు.. బరిలోకి మా అమ్మాయి ..!
ప్రస్తుతం కేశినేని చిన్న ఎంపీగా ఉన్నారు. అయితే.. నాని స్థాయిలో చిన్ని ప్రజల మధ్య పేరు తెచ్చుకోలేక పోతున్నారన్నది టీడీపీ నాయకులు చెబుతున్న మాట.
By: Garuda Media | 1 Dec 2025 9:00 PM ISTవిజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నాని.. రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిం దే. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఆయన తిరిగి పుంజుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతు న్నా.. ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తన కుమార్తె కేశినేని శ్వేతను బరిలో దింపే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనుచరులు చెబుతున్నారు.
గుంటుపల్లి, గొల్లపూడి వంటి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల కాలంలో శ్వేత ప్రజలతో మమేకం అవుతున్నారు. ఏ సమస్య వచ్చినా.. నేనున్నానంటూ, ఆమె ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలు సైలెంట్‌గా సాగుతున్నా.. రాజకీయాలపై ఆమె ఎక్కడా స్పందించడం లేదు. అయితే.. ఏం చేసినా.. రాజకీయాల్లో ఉన్న వారు.. ఎలాంటి అడుగులు వేసినా.. అంతిమంగా వారి లక్ష్యం రాజకీయాలే కాబట్టి.. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం ఉంటుందన్నది కేశినేని వర్గం చెబుతోంది.
ప్రస్తుతం కేశినేని చిన్న ఎంపీగా ఉన్నారు. అయితే.. నాని స్థాయిలో చిన్ని ప్రజల మధ్య పేరు తెచ్చుకోలేక పోతున్నారన్నది టీడీపీ నాయకులు చెబుతున్న మాట. ఇది విమర్శ కాకపోయినా.. వాస్తవమేనని అంటు న్నారు. ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం కూడా చెబుతోంది. ఇటీవల చంద్రబాబు చేయించిన ఎంపీల సర్వేలో కేశినేని చిన్నీకి.. మార్కులు తక్కువగా వచ్చాయి. దీనిని బట్టి.. ఆయన గ్రాఫ్ ఆశించిన మేరకు లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.
మరోవైపు.. నాని బయటకు రాకపోయినా.. గతంలో ఆయన చేసిన పనులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లు వంటివి గ్రామాల్లో ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ హవాను వదులుకోవడం ఇష్టం లేదని.. అందుకే వచ్చే ఎన్నికల్లో శ్వేతను బరిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. ఏ పార్టీ తరఫున ఆమె పోటీకి నిలుస్తారు? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే.. వైసీపీ టికెట్ ఇస్తుందని.. కేశినేని అనుచరులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా.. గతంలో విజయవాడ నుంచి ఆమె కార్పొరేటర్‌గా విజయం దక్కించు కున్నారు. తండ్రితోపాటు గత ఎన్నికల తర్వాత.. ఆ పదవికి రాజీనామా చేశారు.
