Begin typing your search above and press return to search.

మరో సీఎం కుమార్తె పై ఈడీ కేసు నమోదు... వివరాలివే!

కేరళ సీఎం కుమార్తె వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థకు సంబంధించిన ఓ కేసులో ఈడీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు!

By:  Tupaki Desk   |   27 March 2024 1:35 PM GMT
మరో సీఎం కుమార్తె పై ఈడీ కేసు నమోదు... వివరాలివే!
X

ప్రస్తుతం దేశంలో ఒకపక్క సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొనగా.. మరోపక్క ఈడీ దాడులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులపై ఈడీ అధికారుల వరుస దాడులు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె పై ఈడీ కేసు నమోదు చేసిన విషయం ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారింది.

అవును... దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, వారి కుటుంబ సభ్యులపై వరుసగా జరుగుతున్న ఈడీ దాడులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి! ఈ క్రమంలో ఇప్పటికే జార్ఖాండ్ సీఎం హేమత్ సోరెన్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తెలంగాణ సీఎం కుమార్తె, బీఆరెస్స్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతై తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేరల సీఎం కుమార్తె పై ఈడీ కేసు నమోదు చేసింది!

ఇందులో భాగంగా కేరళ సీఎం కుమార్తె వీనా విజయన్ తో పాటు మరికొంతమందిపైనా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీణా విజయన్ తో పాటు మరికొందరికి కూడా త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ అంశం కేరళలోనే కాకుండా... దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

కేరళ సీఎం కుమార్తె వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థకు సంబంధించిన ఓ కేసులో ఈడీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు! ఈ కంపెనీకి మరో ప్రైవేటు కంపెనీ అక్రమంగా భారీగా చెల్లింపులు చేసిందనేది ఆరోపణ అని తెలుస్తుంది. ఇందులో భాగంగా... కొచ్చీకి చెందిన కొచ్చిన్ మినరల్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీ.ఎం.ఆర్.ఎ.) అనే ప్రైవేట్ కంపెనీకి, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగిందట.

అయితే.. ఈ ఒప్పందం మేరకు ఎటువంటి సేవలూ అందించనప్పటికీ 2017-18 కాలంలో సీ.ఎం.ఆర్.ఎ. నుంచి... ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపిందని తెలుస్తుంది. ఈ ఆరోపణలతోనే కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ కేసు విచారణను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.