Begin typing your search above and press return to search.

9 ఏళ్లకే సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన కుర్రాడు.. సక్సెస్ స్టోరీ వింటే?

ఐదేళ్ల వయసులోనే టెక్నాలజీపై ఇంట్రెస్ట్ పెంచుకుని, నేడు దుబాయ్ వేదికగా తన సొంత వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఈ టెక్ వండర్ కిడ్ గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం..

By:  Madhu Reddy   |   20 May 2026 4:00 AM IST
9 ఏళ్లకే సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన కుర్రాడు.. సక్సెస్ స్టోరీ వింటే?
X

ఈ రోజుల్లో చాలామంది పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేష్ అనే ఒక 13 ఏళ్ల పిల్లాడు మాత్రం అదే ఫోన్లతో, కంప్యూటర్లతో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించి ఏకంగా సిఈఓ అయిపోయాడు. ఐదేళ్ల వయసులోనే టెక్నాలజీపై ఇంట్రెస్ట్ పెంచుకుని, నేడు దుబాయ్ వేదికగా తన సొంత వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఈ టెక్ వండర్ కిడ్ గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఐదేళ్లకే కంప్యూటర్‌తో స్నేహం:

ఆదిత్యన్ రాజేష్ స్వస్థలం కేరళలోని తిరువల్లా. అయితే అతని తండ్రి ఉద్యోగ రీత్యా వాళ్ల ఫ్యామిలీ దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఆదిత్యన్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ల నాన్న అతనికి కంప్యూటర్, టైపింగ్ వెబ్‌సైట్లను పరిచయం చేశారు. ఆ వయసులోనే కంప్యూటర్ చూసి భయపడకుండా.. కేవలం 6 ఏళ్లకే హెచ్‌టిఎమ్‌ఎల్, సిఎస్ఎస్, లాంటి కోడింగ్ లాంగ్వేజెస్‌ను నేర్చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

9 ఏళ్లకే మొబైల్ యాప్ క్రియేషన్:

చదువుకుంటూనే కోడింగ్‌పై పట్టు సాధించిన ఆదిత్యన్.. తనకు బోర్ కొట్టినప్పుడల్లా కొత్త విషయాలు ట్రై చేసేవాడు. అలా కేవలం 9 సంవత్సరాల వయసులోనే తన మొదటి ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్‌ను సొంతంగా డెవలప్ చేశాడు. ఇక తన టాలెంట్‌ను టెస్ట్ చేసుకోవడానికి అతను చేసిన ఈ ప్రయత్నం.. భవిష్యత్తులో పెద్ద సక్సెస్‌కు పునాది వేసింది.

13 ఏళ్లకే సొంత కంపెనీ.. సీఈఓగా రికార్డ్:

ఆదిత్యన్‌కు 13 ఏళ్లు వచ్చేసరికి టెక్నాలజీపై పూర్తి అవగాహన వచ్చేసింది. దాంతో అతను ఊరికే ఉండిపోకుండా తన ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో ‘ట్రినెట్ సొల్యూషన్స్’ అనే వెబ్ డిజైనింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇక ఇండియాలోనే అత్యంత చిన్న వయసున్న సీఈఓలలో ఒకడిగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు.

స్కూల్ చదువు.. కంపెనీ పనులు:

ఒక పక్క స్కూల్‌కు వెళ్తూనే.. మరోపక్క తన కంపెనీని ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు ఆదిత్యన్. ఇప్పటికే తన టీమ్‌తో కలిసి 12 మందికి పైగా క్లయింట్లకు వెబ్‌సైట్లు, యాప్స్, లోగోలను డిజైన్ చేసి ఇచ్చాడు. అంతేకాదు, తను చదువుకునే స్కూల్ కోసం ఒక ప్రత్యేకమైన క్లాస్ మేనేజ్‌మెంట్ యాప్‌ను కూడా తయారు చేశాడు. ఇక ఖాళీ సమయాల్లో క్లాస్‌మేట్స్‌కు టెక్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా.. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కోడింగ్, గేమింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తున్నాడు.

నేటి సమాజానికి ఎంతో అవసరం:

ఈ రోజుల్లో చిన్న పిల్లల చేతికి ఫోన్ ఇస్తే చాలు.. దానికి అడిక్ట్ అయిపోతున్నారని తల్లిదండ్రులు తెగ బాధపడుతుంటారు. అలాంటి పిల్లలందరికీ ఆదిత్యన్ రాజేష్ ఒక గొప్ప ఇన్‌స్పిరేషన్. టెక్నాలజీని టైమ్ వేస్ట్ చేయడానికి కాకుండా.. మన నాలెడ్జ్ పెంచుకోవడానికి, లైఫ్‌లో ఎదగడానికి ఎలా వాడుకోవచ్చో ఈ పిల్లవాడిని చూసి నేటి సమాజం ఎంతో నేర్చుకోవాలి.

భవిష్యత్తులో తన కంపెనీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, ఐఓఎస్ డివైజ్‌ల కోసం పవర్‌ఫుల్ యాప్స్ తయారు చేయాలనేదే ఆదిత్యన్ కల. సాధించాలనే పట్టుదల, ప్యాషన్ ఉంటే వయసుతో అస్సలు సంబంధం లేదని నిరూపించిన ఈ కేరళ టెక్ హీరో కథ నిజంగా గ్రేట్.