Begin typing your search above and press return to search.

సీమలో టీడీపీకి బిగ్ షాక్... వైసీపీలోకి కీలక నేత!

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమలోని కీలక నేత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 April 2024 4:44 AM GMT
సీమలో టీడీపీకి బిగ్  షాక్... వైసీపీలోకి కీలక నేత!
X

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమలోని కీలక నేత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం. చంద్రబాబుపై ఉన్న తీవ్ర అసంతృప్తే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం అని వార్తలు వస్తున్నాయి. టిక్కెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

అవును... గతంలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రభాకర్... ఈసారి డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ఎక్కడో చోటు కల్పిస్తారని ప్రభాకర్‌ ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో ప్రభాకర్‌ ను పక్కన పెట్టిన చంద్రబాబు.. డోన్ స్థానంలో కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పేరును ఖారారు చేశారు. ఇదే సమయంలో... రెండో ఆప్షన్ గా ఉన్న పత్తికొండ సీటును సోదరుడు కేఈ కృష్ణమూర్తి కుమారుడికి కేటాయించారు.

దీంతో... అనుకున్న రెండు స్థానాల్లో టిక్కెట్ దక్కకపోయేసరికి ప్రభాకర్ అధిష్టాణంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఇందులో భాగంగా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారని.. ఈ సమయంలో తన అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ రాజకీయాలపై ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది. ఈ సమయంలో... కుమారుడు రుద్ర ఒత్తిడి మేరకు అనుచరులతో కలిసి ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు!

ఈ క్రమంలోనే ఒకటి రెండు రోజుల్లో సీఎం జగన్ సమక్షంలో కేఈ ప్రభాకర్ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ప్రభాకర్ తో మంతనాలు జరిగాపరని.. ఈ మేరకు అధికారపార్టీ నుంచి స్పష్టమైన హామీ దక్కించుకున్నారని తెలుస్తుంది. అయితే... కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ ను ప్రకటించే అవకాశం ఉందనే చర్చ స్థానికంగా నడుస్తుంది!