Begin typing your search above and press return to search.

బీజేపీ ఆడేసుకోడానికి.. ఢిల్లీ సీఎం గ్యాపిచ్చేశారే!

ఆప్ అధినేత కేజ్రీవాల్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య మ‌రో వార్ తెర‌మీదికి వ‌చ్చింది. దీనికి సీఎం కేజ్రీవాలే కార‌ణ‌మ‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   18 July 2023 4:23 AM GMT
బీజేపీ ఆడేసుకోడానికి.. ఢిల్లీ సీఎం గ్యాపిచ్చేశారే!
X

నువ్వు ఒక‌టంటే.. నేను రెండంటా! అన్న‌ట్టుగా రాజ‌కీయ దుమారం చేసుకునే డిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య మ‌రో వార్ తెర‌మీదికి వ‌చ్చింది. దీనికి సీఎం కేజ్రీవాలే కార‌ణ‌మ‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న తీవ్ర ఇర‌కాటం లో ఉన్నారు.

ఢిల్లీలో ఉన్నతాధికారుల‌ పై అజ‌మాయిషీ అధికారం కేజ్రీవాల్‌ కు లేకుండా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని నుంచి ఆయ‌న ఇంకా బ‌య‌ట ప‌డ‌లేదు. అయితే..ఇంత‌ లోనే కేజ్రీవాల్ కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తిస్తూ. బెంగ‌ళూరు లో నిర్వ‌హించిన విప‌క్ష నేత‌ల భేటీకి వ‌చ్చారు. ఇక్క‌డే ఆయ‌న పెద్ద త‌ప్పుచేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం

ఎందుకంటే.. ప్ర‌స్తుతం యమునా న‌దికి పోటెత్తిన వ‌ర్షాల కార‌ణంగా ఢిల్లీలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌దిగ్భంతో చిక్కుకున్నాయి. దీంతో ప్ర‌జ‌లు విలవిల్లాడుతున్నారు. 'ఇంటి నుంచి బ‌య‌ట‌ కు రావొద్దు' అన్న ఒక్క మాటత‌ప్ప సీఎం కేజ్రీవాల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ చేయ‌లేక పోయారు.

మ‌రోవైపు ఇంత‌ లోనే ఆయ‌న బెంగ‌ళూరు కు వ‌చ్చి విప‌క్ష భేటీ లో పాల్గొన్నారు. దీంతో బీజేపీ.. ఒక్క‌సారిగా కేజ్రీవాల్‌ పై విరుచుకుప‌డింది. ఢిల్లీ ప్రజల ను గాలికి వ‌దిలేసి విపక్ష పార్టీల సమావేశానికి వెళ్లడం ఏమిటని బీజేపీ నిప్పులు చెరిగింది.

ఢిల్లీలో వరద సంక్షోభాన్ని కేజ్రీవాల్ గాలికి వదిలేశారని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు దుయ్య‌బ‌ట్టారు. ఆయనను ఎలాంటి సీఎం అనాలి? అంటూ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో వ‌ర‌ద‌లు వ‌చ్చి ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నా.. కాంగ్రెస్, సీపీఎం వంటివి కూడా నోరు విప్ప‌డం లేదు.. అని వ్యాఖ్యానించారు. "ఇదొక స్వార్థపరుల కూటమి'' అని ఉమ్మ‌డి విప‌క్ష నేత‌ల స‌మావేశం పై విరుచుకుప‌డ్డారు. ఇలాంటి పార్టీలు దేశాని కి మంచి భవిష్యత్తు ఇవ్వగలరా? అని సీనియ‌ర్లు నిల‌దీశారు. మొత్తానికి కేజ్రీవాల్ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా వివాదంగా మార‌డం గ‌మ‌నార్హం.