యూట్యూబర్లకు చెక్.. కేదార్ నాథ్ లో కొత్త రూల్
తాజాగా యూట్యూబర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని చార్ ధామ్ మహా పంచాయితీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 2 April 2025 9:55 AM ISTదేశంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భావించే కేదార్ నాథ్ లో యూట్యూబర్ల గొట్టాలకు.. కెమేరాలకు అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి ఏటా లక్షలాది మంది యాత్రికులు రావటం తెలిసిందే. ఇక్కడకు వచ్చే యూట్యూబర్లు రీల్స్ తీస్తూ.. భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించటంతో పాటు.. వారు చేస్తున్న రచ్చతో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్న వాదన ఉంది.
దీనికి సంబంధించి తాజాగా యూట్యూబర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని చార్ ధామ్ మహా పంచాయితీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ లోని నాలుగు ధామ్ లలో అత్యధికంగా రీల్స్.. వీడియోలు కేదార్ నాథ్ ధామ్ లోనూ రూపొందిస్తుంటారు. ఇక్కడకు వచ్చే యూట్యూబర్లు విరివిగా వీడియోలు.. రీల్స్ చేసి వైరల్ చేస్తుంటారు.
వీరి వీడియోల ప్రభావం భక్తుల మీదా.. తీర్థయాత్రల మీదా పడుతుందన్న అభిప్రాయం ఉంది. విశ్వాసాలతో మెలిగేవారిని పలు వీడియోలు ఆందోళనకు గురి చేస్తున్నాయని.. అందుకే ఆలయ అధికారులు కేదార్ నాథ్ లో యూట్యూబర్లను నియంత్రించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రీల్స్.. వీడియోలు చేయటాన్ని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్.. వీడియోల్ని నిషేధించటంతో పాటు.. ఆలయంలో వీఐపీ దర్శనాలను కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు భిన్నంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. తొలుత యమునోత్రి.. గంగోత్రి ఆలయాలు తెరుస్తారు. మే 2న కేదార్ నాథ్.. మే 4న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఇదే సమయంలో రీల్స్.. వీడియోలు తీసే అంశంపై బ్యాన్ విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
