Begin typing your search above and press return to search.

కేసీయార్ డబుల్ యాక్షన్ చేయబోతున్నారా ?

రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నారట.

By:  Tupaki Desk   |   5 Aug 2023 8:35 AM GMT
కేసీయార్ డబుల్ యాక్షన్ చేయబోతున్నారా ?
X

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ డబుల్ యాక్షన్ చేయబోతున్నారా ? డబుల్ యాక్షనంటే రెండు రకాల వేషాలు వేస్తారని కాదు. రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నారని సమాచారం. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటంలో కొత్తేముంది అనుకుంటున్నారా ? ఉంది కేసీయార్ చేయబోయేది కచ్చితంగా డబుల్ యాక్షన్ అవబోతోంది. ఎలాగంటే రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నారట. అది కూడా రెండు రాష్ట్రాల నుంచి పోటీచేయాలని ఆలోచిస్తుండటమే వెరైటీ.

ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేస్తే ఎలా ఉంటుందనే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నారట. పై రెండునియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలుపుఅవకాశాల పై సర్వేలు కూడా చేయించుకుంటున్నారట. పై నియోజకవర్గాల కు చెందిన నేతల తో రెగ్యులర్ గా భేటీలవుతున్నారు. ఎందుకంటే పై పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

అక్కడినుండి నేతలు వచ్చినపుడల్లా నేరుగా ఫాంహౌస్ లోనే దింపుతున్నారట. వారం రోజులు, పదిరోజుల పాటు నేతల తో చర్చలు జరుపుతున్నారట. జరుగుతున్నది చూస్తుంటే పై రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుండి కేసీయార్ ఎంపీ గా పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో పూర్తిగా మహారాష్ట్రలోని పార్లమెంట్ నియోజకవర్గంపైనే గెలుపుకు ఆధారపడకుండా తెలంగాణా లోని ఏదో ఒక నియోజకవర్గంలో కూడా పోటీకి రెడీ అవుతున్నారట. అంటే మహారాష్ట్రలో గెలుపు కాస్త అటు ఇటు అయినా తెలంగాణ లో మాత్రం పక్కాగా గెలవాలనేది కేసీయార్ వ్యూహంగా అర్ధమవుతోంది.

ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీయార్ పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే దృష్టిపెట్టాలని అనుకుంటున్నారట. మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారం లోకి వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని కొడుకు కేటీయార్ కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంకేతాలు కనబడుతున్నాయి. ఇపుడు కేసీయార్ పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి. అన్నీ వ్యవహారాలు కేటీయార్ చేతులమీదుగానే జరుగుతున్నాయి. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ముఖ్యమైన నిర్ణయాలన్నీ కేటీయార్ ద్వారానే జరుగుతున్నాయి. కాకపోతే వాటి అమలు కేసీయార్ ఆమోదంతో జరుగుతన్నాయంతే.