Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతలతో టచ్ లో కేసీఆర్... బెంగళూరులోని రిసార్టులకు నో ఛాన్స్!

తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. మరికొన్ని గంటల్లో అధికారం ఎవరిది అనే విషయం స్పష్టం కాబోతుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 6:49 AM GMT
కాంగ్రెస్  నేతలతో టచ్  లో కేసీఆర్... బెంగళూరులోని రిసార్టులకు నో ఛాన్స్!
X

తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. మరికొన్ని గంటల్లో అధికారం ఎవరిది అనే విషయం స్పష్టం కాబోతుంది. ఈ మధ్యలో ఎగ్జిట్ పోల్స్ హల్ చల్ చేశాయి. ఆ ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిసింది. ఇదే సమయంలో హంగ్ సర్కార్ చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ మెజారిటీ మొదలైన విషయాలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... తెలంగాణలో అధికారం దక్కేదెవరికనే విషయం మరి కొద్ది గంటల్లో తేలి పోనుంది. ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ఇంకొన్ని ఫలితాలు బీఆరెస్స్ కు ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని చెప్పగా.. ఇంకొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు... హంగ్ కి ఛాన్స్ అని వెల్లడించాయి. దీంతో.. కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా డీకే శివకుమార్ ను రంగంలోకి దించిందని అంటున్నారు!

తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్ – కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. వాటికి తగ్గట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రసవత్తర చర్చకు తెరలేపాయి. ఈ సమయంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.ఇదే సమయంలో బీఆరెస్స్ కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 4న కేసీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు.

ఇదే సమయంలో... కేసీఆర్ కు మ్యాజిక్ ఫిగర్ కు 5 నుంచి 10 స్థానాలు తక్కువ వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అటు బీజేపీ నుంచి కానీ, ఇటు ఎంఐఎం నుంచి కానీ... కేసీఆర్ కు మద్దతు దొరికే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ నేతలకు గాళం వేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని 2018 రోజులు గుర్తుకు తెస్తున్నారు పరిశీలకులు.

ఈ నేపథ్యంలో... కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా... తెలంగాణలో కేసీఆర్‌ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్‌ నేతలకు టచ్‌ లోకి వచ్చారని అన్నారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను లాక్కోవడం కేసీఆర్ కు ఈసారి కుదరదని.. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే లేదనే స్పష్టం చేశారు! దీంతో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!

ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను తాను నమ్మనని, తాను సొంతంగా సర్వేలు చేయిస్తానని చెప్పిన డీకేఏస్... తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ కు పెద్ద వేవ్‌ ఉందని.. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌ లో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.