Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అగ్ర నేతలే టార్గెట్ : పద్మవ్యూహాన్ని రచిస్తున్న కేసీయార్...?

కేసీయార్ కాంగ్రెస్ ని సీరియస్ గానే తీసుకుంటున్నారు. అసలైన పోటీ అక్కడ నుంచే అని కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది అని సర్వే నివేదికలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:00 PM IST
కాంగ్రెస్ అగ్ర నేతలే టార్గెట్ : పద్మవ్యూహాన్ని రచిస్తున్న కేసీయార్...?
X

తెలంగాణాలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని కేసీయార్ గట్టిగానే భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలు కేసీయార్ కి చాలా ముఖ్యం. మూడవసారి కనుక గెలిస్తే కేసేయార్ జస్ట్ ఆరేడు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారని అంటున్నారు. ఆ మీదట లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన కుమారుడు కేటీయార్ కి సీఎం గా పట్టం కడతారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేసీయార్ కి ఈ ఎన్నికలు అందరి కంటే కూడా చాలా కీలకం అంటున్నారు.

కేసీయార్ కాంగ్రెస్ ని సీరియస్ గానే తీసుకుంటున్నారు. అసలైన పోటీ అక్కడ నుంచే అని కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది అని సర్వే నివేదికలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందని కూడా కొన్ని సర్వేలు అంటున్నారు. దీంతో బీయారెస్ ఫుల్ అలెర్ట్ అయింది. ఇక కేసీయార్ అయితే రానున్న కాలమంతా దాదాపుగా జనంలోనే ఉండేలా పక్కా ప్లాన్ తో బరిలోకి దిగిపోతున్నారు.

కాంగ్రెస్ అగ్ర నేతలను ఆయన లిస్ట్ చేసి మరీ టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ జాబితాలో తొలి పేరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ మూకుమ్మడిగా మంత్రులు పార్టీ కీలక నేతలు అంతా విగరస్ గా ప్రచారం నిర్వహించాలని బీయారెస్ నుంచి కూడా గట్టి అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోవాలని నిర్ణయించారుట.

అలాగే ఉత్తం కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, ఇలా పెద్ద లిస్ట్ నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. సీఎం పదవికి ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఎవరైనా ప్రభావితమైన లీడర్లుగా పార్టీలో ఉన్నారో వారి మీదనే గురి పెట్టి ఎన్నికల ప్రచారంలో ఎటాక్ చేయడమే బీయారెస్ నయా వ్యూహంగా కనిపిస్తోంది. దీని వల్ల రేపటి రోజున కాంగ్రెస్ లీడర్లు ఎవరూ తమ సొంత నియోజకవర్గాలను దాటి బయటకు చూసే చాన్స్ అసలు ఇవ్వరాదని బీయారెస్ అధినాయకత్వం భావిస్తోంది.

తామున్న చోటనే గట్టి పోటీ ఉంటే అక్కడే వారు రాజకీయ పద్మవ్యూహంలో ఇరుక్కుంటే ఇక ఇతర నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించే చాన్స్ ఉండదని ఆ విధనా వారిని కట్టడి చేస్తే కాంగ్రెస్ కి అది దెబ్బ అవుతుందని బీయారెస్ భారీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.

దీని కోసం కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు మాటకారి వక్తలను ఒక టీం గా రెడీ చేసి పెడుతోంది అంటున్నారు. వీరంతా వెళ్ళి కాంగ్రెస్ సీనియర్లు అగ్ర నేతల నియోజకవర్గాలలో ఉప ఎన్నికల మాదిరిగా గ్రౌండ్ లెవెల్ వరకూ మోహరించి ఎక్కడా కాంగ్రెస్ కి పట్టు దొరకకుండా చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి బీయారెస్ ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో.