Begin typing your search above and press return to search.

ఓడిన తరువాత కేసీయార్ ఫస్ట్ టైం...!

మొత్తానికి ఫార్మ్ హౌజ్ కి బీయారెస్ నేతలు అంతా వెళ్ళి కేసీయార్ ని కలిశారు. వారితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గజ్వేల్ లో గెలిచిన ధృవ పత్రం కూడా కేసీయార్ కి స్థానిక నేతలు అందించారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 3:35 AM GMT
ఓడిన తరువాత కేసీయార్ ఫస్ట్ టైం...!
X

కేసీయార్ రాజకీయ జీవితంలో మరో ఘట్టం ఇది. ఆయన 2000 నుంచి మొదలెడితే ఎపుడూ తీరిక లేని పని. అది ఉద్యమం అయినా రాజకీయం అయినా రెండు చేతులా నడిపారు. సవ్యసాచిగా పనిచేసారు. ఇక తెలంగాణా సాధించిన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు అధికార హోదాలో ఉన్నారు.

ఆ మీదట జాతీయ స్థాయిలోనూ తన పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ బీజేపీలనే ఢీ కొడుతూ ఢిల్లీ స్థాయిలో మకాం పెట్టి థర్డ్ ఫ్రంట్ అంటూ గుబులు పుట్టించారు. ఇక టీయారెస్ ని కాస్తా బీయారెస్ గా మార్చి కొత్త జాతీయ పార్టీ సౌత్ నుంచే అంటూ బిగ్ సౌండ్ చేశారు.

ఇలా కేసీయార్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశాక టీడీపీ నుంచి బయటకు వచ్చాక చేతి నిండా పనితోనే ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి కేసీయార్ ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో బీయారెస్ ఓడాక ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. ఇక కేసీయార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రాజీనామా పత్రాన్ని పంపించేశారు.

అంతే కాదు డైరెక్ట్ గా ఫార్మ్ హౌజ్ కి వెళ్ళిపోయారు. ఇక కేసీయార్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు, మీడియా మీట్ లేదు. అసలు ఓడిన తరువాత ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆయన రియాక్షన్ ఏంటి కేసీయార్ ఎలా ఉన్నారు ఇలాంటి ఆసక్తులు అందరిలో ఉనాయి.

మొత్తానికి ఫార్మ్ హౌజ్ కి బీయారెస్ నేతలు అంతా వెళ్ళి కేసీయార్ ని కలిశారు. వారితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గజ్వేల్ లో గెలిచిన ధృవ పత్రం కూడా కేసీయార్ కి స్థానిక నేతలు అందించారు. అలా అందుకున్న ఫోటో ఒకటి. అదే విధంగా పార్టీ నేతలతో మాట్లాడుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

దాంతో చాలా మందికి ఒక ఉత్కంఠ అయితే తీరింది. ఓడాక కేసీయార్ ఎలా ఉన్నారు అన్న దాని మీద వారికి ఉన్న ఆసక్తి కూడా తీరింది. అయితే కేసీయార్ ఫోటో చూసిన వారికి ఆయన కొంత దిగాలుగా ఉన్నారని మాత్రం అర్ధం అవుతోంది. అధికారం లో ఉండే రాజ ఠీవీ దర్జా అయితే కొంత వరకూ తగ్గాయేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇక కేసీయార్ లో పోరాట యోధుడు ఉన్నారని ఆయన మళ్లీ రీ బాక్ అవుతారని గట్టిగా పోరాడుతారని బీయారెస్ నేతలు అంటున్నారు. అయితే ఎంతటి వారికైనా ఓటమి బాధ ఉంటుంది. అలాగే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఓడిన కేసీయార్ కి అది అదనపు బాధగా ఉంది.

ఏది ఏమైనా తొందరలోనే పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేలు అందరినీ కలుస్తామని కేసీయార్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. బీయారెస్ శాసనపక్ష నేతను ఎన్నుకుని ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీయారెస్ సిద్ధమవుతోంది. కేసీయార్ కూడా కొద్ది రోజుల తరువాత మళ్లీ బయటకు వచ్చి లోక్ సభ ఎన్నికల వ్యూహాలను రచిస్తారు అని అంటున్నారు.