Begin typing your search above and press return to search.

టార్గెట్ కేసీఆర్.. తర్వాత మల్లారెడ్డే.. ఇదే సూపర్ సాక్ష్యం

ఇదిలా ఉంటే.. నామినేషన్ల దాఖలు వేళ.. తెలంగాణలో ఇద్దరు ముఖ్యనేతల్ని టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:27 AM GMT
టార్గెట్ కేసీఆర్.. తర్వాత మల్లారెడ్డే.. ఇదే సూపర్ సాక్ష్యం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు ఘట్టం పూర్తి కావటమే కాదు.. నామినేషన్లను పరిశీలించి.. రిజెక్టు చేయటం.. ఉపసంహరించుకోవటానికి ఒక రోజు సమయం ఉండటం ఒక ఎత్తు అయితే.. దాఖలైన నామినేషన్లను పరిశిలించి.. అందులోని తప్పుఒప్పుల్ని చెక్ చేసి వాటిలో కొన్నింటికి రిజెక్టు చేసే ప్రక్రియ సాగటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నామినేషన్ల దాఖలు వేళ.. తెలంగాణలో ఇద్దరు ముఖ్యనేతల్ని టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల హోరులో పెద్దగా బయటకు ఫోకస్ కాని ఒక ఉదంతం.. నామినేషన్ల పరిశీలన వేళ బయటకు వచ్చింది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరే నియోజకవర్గాల్లో లేని విధగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అయితే.. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నది అధికార పార్టీ నేతలే. వారిని టార్గెట్ చేస్తూ సరికొత్త అస్త్రాన్ని నామినేషన్ల వేళ.. సంధించారన్న విషయం తాజాగా వెలువడుతున్న గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో నిలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కు పోటీగామరో 114 మంది నామినేషన్లు దాఖలు చేయటం గమనార్హం. కేసీఆర్ అంత కాకున్నా.. ఆయనతో పోటీ పడే అధికార పార్టీకి చెందిన మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి 67 నామినేషన్లు దాఖలైన విషయం విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లే.. మంత్రి మల్లారెడ్డిని సైతం నామినేషన్లతో సవాలు విసిరినట్లైందని చెబుతున్నారు. ఆసక్తికరంగా నామినేషన్లతో షాకిస్తున్న నియోజకవర్గాల్లో మూడో స్థానంగా నిలిచింది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో ఉన్న కామారెడ్డి కావటం విశేషం.

కామారెడ్డిలో 58 మంది నామినేష్లు దాఖలు చేయటం.. అక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో నిలవటం చూస్తే.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని విచిత్రమైన పరిస్థితి తాజాగా నెలకొందని చెబుతున్నారు. ఈ భారీ నామినేషన్లు కేసీఆర్ కు గండంగా మారనున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.మరోవైపు రేవంత్ రెడ్డి బరిలో ఉన్న కొడంగల్ లో కేవలం 15 నామినేషన్లు మాత్రమే దాఖలు కావటం గమనార్హం. సీఎం కేసీఆర్.. మంత్రి మల్లారెడ్డితో సహా మరికొందరిని టార్గెట్ చేసినట్లుగా దాఖలైన నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. దాని ఎఫెక్టు ఎంతన్నది తేలాలంటే.. బుధవారం సాయంత్రానికి కానీ ఒక కొలిక్కి రాదని చెప్పక తప్పదు.