Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ కు కష్టాలా?

కేసీఆర్ కోటరీ వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు కేసీఆర్ ఎవరికి సమయం ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   20 April 2024 10:30 AM GMT
కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ కు కష్టాలా?
X

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయాక మేల్కొంటే ఫలితం ఉంటుందా? ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది. ఇన్నాళ్లు అధికార మదంతో విర్రవీగిన పార్టీకి ఇప్పుడు ఏ దారి కనిపించడం లేదు. అధికారం దూరం కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

కేసీఆర్ కోటరీ వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు కేసీఆర్ ఎవరికి సమయం ఇవ్వలేదు. దీంతో వారిలో నైరాశ్యం నెలకొంది. దీంతో నేతలు పార్టీని వీడి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. నియంత పోకలను దాటుకుని వెళ్తున్నారు. పార్టీలో నెలకొన్న పరిణామాలు కూడా వారు వెళ్లేందుకు కారణమవుతున్నాయి.

ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేతల్లో భయం పుట్టేలా చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని తేలడంతో పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడుతున్నందున బీఆర్ఎస్ కు ఇది పెద్ద దెబ్బే అంటున్నారు. దీని వల్ల ఇంకా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోననే బెంగ అందరిలో పట్టుకోవడం సహజమే.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ కోటరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిర్వాకం వల్ల పార్టీకి దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మందికి ఇగో సమస్య వచ్చింది. తమ మాటను కాదని కేసీఆర్ ఇలా నియంత పోకడలు పోతున్నారనే ఆగ్రహం కలిగింది. దీంతోనే నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇంకా చాలా మంది పోతారని తెలుస్తోంది.

పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాల మూలంగానే నేతలు వీడుతున్నారు. కేటీఆర్ లో కూడా అహంకార ధోరణి పెరగడంతోనే చాలా మంది దూరమయ్యారు. తండ్రికొడుకుల ధోరణుల వల్ల చాలా మంది హర్టయ్యారు. దీంతోనే పార్టీని వీడి పోయేందుకు రెడీ అవుతున్నారు. వారు మేల్కోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం దగ్గరలోనే ఉందంటున్నారు.