Begin typing your search above and press return to search.

కేసీయార్ పై ఒత్తిడి పెంచుతున్నారా ?

దీంతో ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ అంతా గబ్బుపట్టిపోయింది. షెడ్యూల్ ఎన్నికలు ఇపుడు నాలుగు నెలల్లోకి వచ్చేసింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:38 AM GMT
కేసీయార్ పై  ఒత్తిడి పెంచుతున్నారా ?
X

రాబోయే ఎన్నికల్లో గెలుపు విషయంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలను నిరుద్యోగ భృతి హామీ భయపెడుతోందట. 2018 ఎన్నికల్లో గెలుపుకోసం కేసీయార్ రు. 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మరికొన్ని హామీల్లాగే దీన్ని అటకెక్కించేశారు. ఇంతకాలం నిరుద్యోగ భృతి గురించి కానీ ఉద్యోగాల భర్తీ విషయమై కానీ కేసీయార్ పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే భృతి ఇచ్చే విషయంలో కాస్త హడావుడి చేసినా తర్వాత చప్పపడిపోయింది.

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఉద్యోగాల భర్తీపేరుతో ప్రభుత్వం హడావుడి మొదలుపెట్టింది. గ్రూప్ 1 అని గ్రూప్ 2 అని రకరకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.

అయితే పరీక్షల నిర్వహణలో ఘోరంగా ఫెయిలైంది. చాలా పరీక్షల పేపర్లు లీకులు అవ్వటంతో కొన్ని పరీక్షలను రద్దుచేసింది. మరికొన్ని పరీక్షల విషయంలో కోర్టు ఆదేశాలతో అలాగే ముందుకెళుతోంది. మొత్తంమీద పరీక్షల నిర్వహణను అంతా కంపు చేసేసింది.

దీంతో ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణ అంతా గబ్బుపట్టిపోయింది. షెడ్యూల్ ఎన్నికలు ఇపుడు నాలుగు నెలల్లోకి వచ్చేసింది. పరీక్షల నిర్వహణ ఎప్పటికి అవుతుంది, ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు ? ఉద్యోగాలు ఎప్పుడిస్తారు ? పరీక్ష పేపర్ల లీకేజీ మొత్తం అధికారపార్టీ నేతల పిల్లలకోసమే జరిగిందనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపుంటే మరోవైపు నిరుద్యోగ భృతిపై అసలు ప్రభుత్వం ఆలోచన కూడా చేయటంలేదు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం డిగ్రీచేసిన వాళ్ళే సుమారు 30 లక్షలమంది ఉంటారట. అలాగే పీజీ చేసిన వాళ్ళు మరో 10 లక్షలట. అంటే నిరుద్యోగుల సంఖ్య సుమారు 40 లక్షలుంటుందని అంచనా. ఇంతమంది ప్రభుత్వం మీద మండిపోతున్నారంటే ప్రభుత్వానికి డేంజర్ బెల్సనే చెప్పాలి.

నిరుద్యోగులు 40 లక్షలైతే మళ్ళీ కుటుంబసభ్యుల సంఖ్యను కూడా కలుపుకుంటే సుమారు 1 కోటి మంది దాటేస్తారు. వీళ్ళంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లేస్తారని మంత్రులు, ఎంఎల్ఏలు భయపడుతున్నారట. అందుకనే వెంటనే నిరుద్యోగభృతి అమలుచేయాలని కేసీయార్ పై ఒత్తిడి తెస్తున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.