Begin typing your search above and press return to search.

సరికొత్త అభ్యర్థులతో సర్ ప్రైజ్ చేసిన గులాబీ సారు

ఈ క్రమంలో తాజాగా నాలుగు ఎంపీ స్థానాల(మల్కాజిగిరి.. చేవెళ్ల.. మెదక్.. జహీరాబాద్)కు అనూహ్య రీతిలో కొత్త ముఖాలతో తెర మీదకు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   13 March 2024 4:01 AM GMT
సరికొత్త అభ్యర్థులతో సర్ ప్రైజ్ చేసిన గులాబీ సారు
X

లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడి కానున్న నేపథ్యంలో గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు తాజాగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం గులాబీ పార్టీలోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసినట్లైంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే పలు పార్టీలు కొన్ని స్థానాలకు తమ అభ్యర్థుల వివరాల్ని వెల్లడించింది.

ఈ క్రమంలో తాజాగా నాలుగు ఎంపీ స్థానాల(మల్కాజిగిరి.. చేవెళ్ల.. మెదక్.. జహీరాబాద్)కు అనూహ్య రీతిలో కొత్త ముఖాలతో తెర మీదకు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉందంటూ ప్రచారం జరిగినా.. ప్రచారంలో వినిపించిన పేర్లకు సంబంధించిన వారు చివర్లో వెనక్కి తగ్గటం.. ఈ అంశం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన వేళ.. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా కీలకమైన నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన వెంటనే విడుదల కావటం ఆసక్తికరంగా మారింది. రేసులో పెద్దగా లేని పేర్లు అనూహ్యంగా తెర మీదకు రావటం చూసినప్పుడు అభ్యర్థుల పేర్లతో గులాబీ బాస్ కేసీఆర్ సర్ ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి.

మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి శంభీపూర్ రాజును ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. చిన్న కార్యకర్తగా మొదలైన ఆయన మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంగతి తెలిసిందే. చేవేళ్ల ఎంపీ స్థానానికి పలు పేర్లు వినిపించినా.. చివరకు కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. మెదక్ ఎంపీ స్థానానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి.. జహీరాబాద్ కు గాలి అనిల్ కుమార్ ను ఓకే చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. చేవేళ్ల.. జహీరాబాద్ కు సంబంధించిన ఈ ఇద్దరు అభ్యర్థుల ఊసే లేదు. అలాంటిది అనూహ్యంగా తెర మీదకు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.

మొదట్లో అనుకున్న అభ్యర్థులు ఎవరికి వారు గులాబీ బాస్ కు హ్యాండ్ ఇవ్వటంతో.. ఆ అంశం చర్చగా మారితే పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుందన్న ఉద్దేశంతోనే.. అభ్యర్థుల ప్రకటనను హడావుడిగా ప్రకటించారన్న మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి శంభీపూర్ రాజుతో పోలిస్తే.. మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికే సానుకూలత ఎక్కువ. కానీ.. మొదట్లో టికెట్ మీద ఆసక్తిని వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారు వెనక్కి తగ్గటంతో శంభీపూర్ పేరును తెర మీదకు తీసుకొచ్చి.. దాన్నిఅధికారికం చేసినట్లుగా చెప్పాలి.