Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను హాస్పిటల్ పాలు చేసిన 2 మడతల పంచె!

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటన ఎలా చేసుకుందన్న దానికి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:59 AM GMT
కేసీఆర్ ను హాస్పిటల్ పాలు చేసిన 2 మడతల పంచె!
X

ఫాంహౌస్ లోని బాత్రూంలో జారి పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదంతం గురించిన ఒక షాకింగ్ నిజం వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటన ఎలా చేసుకుందన్న దానికి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ యూనివర్సిటీలోనూ పుట్టిన ఫేక్ న్యూస్ కాకుండా.. అసలుసిసలైన నిజంగా చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కొందరు తమకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద జరిగిన విషయాన్ని చెప్పటం గమనార్హం.

ఫాంహౌస్ లో గొడవ జరిగిందని.. కేటీఆర్, హరీశ్ మధ్య జరిగిన సంవాదంలో కేసీఆర్ ఇద్దరి మధ్యన రాజీ కుదిర్చే ప్రయత్నంలో ఆయన్ను తోసేశారంటూ సాగుతున్న విష ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదు. ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. హరీశ్ కు కానీ కేటీఆర్ కు కాని.. కేసీఆర్ ముందు కూర్చునేందుకు సైతం సాహసం చేయరు. ఆయనంటే అంత భక్తి. అంతకు మించిన గౌరవం. ఈ విషయాలేమీ తెలియని వారంతా తమ నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్ ప్రకారం చూస్తే.. ఫాంహౌస్ లో రాత్రి వేళ బాగా పొద్దుపోయిన తర్వాత తమకున్న బలాల గురించి చర్చ జరిగినట్లుగా ప్రచారం చేశారు.

నిజానికి.. అంత లేటు నైట్ పూట కూర్చోవటం ఉండదు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు (మరీ పొద్దుపోయే వరకు మాత్రం కాదు) చర్చల సందర్భంగా కూర్చుంటారే తప్పించి.. లేట్ నైట్ మాత్రం ఎవరికి అందుబాటులో ఉండరన్న విషయం ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారందరికి తెలిసిందే. ఇలా మొదటి మాట నుంచి చివరి మాట వరకుఅన్ని అబద్ధాలతో అందంగా తయారు చేసిన కథ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.

ఇక.. అసలు నిజానికి వస్తే.. ఫాంహౌస్ లో ఉన్నంత సేపు కేసీఆర్ ఎక్కువగా తెల్లటి పంచెను కడతారు. అది కూడా రెండు మడలతో కట్టుకోవటం ఆయనకు ఇష్టం. కేసీఆర్ లాంటి వారు కట్టుకునే పంచెలకు బలంగా దట్టించినట్లుగా గంజితో ఇస్త్రీ చేసి ఉంచుతారు. అలాంటి వాటిని ధరించటం కేసీఆర్ కు ఎంతో ఇష్టం. ఎప్పటిలానే పంచె ధరించిన ఆయన.. అర్థరాత్రి దాటిన తర్వాత బాత్రూంకువెళ్లాల్సి రావటం.. ఆ క్రమంలో ఆయన రెండు మడతలు కేసీఆర్ కాలి బ్రొటన వేలికి తగలంతో ఆయన ఒక్కసారిగా బ్యాలెన్సు తప్పి.. కింద పడ్డారు.

ఇక్కడ లక్ ఏమంటే.. సాధారణంగా ఇలా జారి పడినప్పుడు వెనక్కిపడిపోతారు. అదే జరిగితే.. తలకు తీవ్ర గాయమయ్యేది. కాకుంటే.. తాజా ఉదంతంలో మాత్రం పక్కకు పడ్డారు. ఒక్కసారి అదాటున ఓపక్కకు కింద పడిపోవటంతో.. బలంగా ఆయన తుంటి ఎముకను నేల తాకింది. దీంతో ఫ్యాక్చర్ అయ్యింది. వయసుఎక్కువగా ఉండటంతో..తుంటి ఎముకను రీప్లేస్ చేశారు. అయితే.. కింద పడినప్పుడు మాత్రం తీవ్రమైన నొప్పితో ఆయన ఇబ్బంది పడినట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతం గురించి తెలిసినవారంతా భయపడింది.. కంగారుపడింది.. ఓపక్కగా కాకుండా వెనక్కి పడి ఉంటే.. చాలా పెద్దప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు. అందుకే.. ఈ ఉదంతంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పిందన్న మాటను వారు చెబుతున్నారు. అయితే.. ఇందుకు భిన్నంగా విష ప్రచారం జోరుగా సాగుతోంది. నిజం కంటే కూడా అబద్ధమే తొందరగా ఆకర్షిస్తుందని చెబుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొందని చెప్పాలి.