Begin typing your search above and press return to search.

కేసీయార్ ఫామ్ హౌస్ లో అలాంటి క్లాసులు మొదలయ్యాయా !

ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ లో కేసీయార్ ఒంటరిగా కూర్చుని అనేక కాంబినేషన్లతో జాబితాను రెడీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 5:44 AM GMT
కేసీయార్ ఫామ్ హౌస్ లో అలాంటి క్లాసులు మొదలయ్యాయా !
X

సిట్టింగ్ ఎంఎల్ఏలకు కేసీయార్ క్లాసులు మొదలయ్యాయా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయమై కేసీఆర్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ లో కేసీయార్ ఒంటరిగా కూర్చుని అనేక కాంబినేషన్లతో జాబితాను రెడీ చేస్తున్నారు. శ్రావణమాసం మొదలవ్వగానే మొదటి జాబితాను ప్రకటించాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. అవసరానికి మంత్రులు కేటీఆర్ లేదా హరీష్ రావులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మొత్తానికి ప్రకటించాలని అనుకుంటున్న మొదటి జాబితాపై పెద్దఎత్తునే కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే కొందరు ఎంఎల్ఏలను ఫాంహౌజ్ కు పిలిపించుకుని ఫుల్లుగా క్లాసులు పీకినట్లు సమాచారం. ఒకపుడు సిట్టింగ్ ఎంఎల్ఏలందరికీ మళ్ళీ టికెట్లిస్తానని స్వయంగా కేసీయారే ప్రకటించారు. అయితే రెగ్యులర్ గా చేయించుకుంటున్న సర్వేల్లో సిట్టింగుల్లో ఎంతమంది మీద వ్యతిరేకత ఉందో బయటపడిందట. సిట్టింగులందరికీ టికెట్లిస్తే పార్టీ ఓడిపోవటం ఖాయమని అర్ధమైందట. అందుకనే సర్వేల్లో ఫీడ్ బ్యాక్ బాగా ఉన్న వాళ్ళకే టికెట్లని కొత్త ఆలోచన చేశారట.

చేయించుకుంటున్న సర్వే రిపోర్టుల్లో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను పిలిపించుకుని క్లాసులు పీకినట్లు తెలుస్తోంది. వాళ్ళపైన ఉన్న ఆరోపణలు, వాటికి ఆధారాలను కూడా చూపించి మాట్లాడారట. పార్టీలో నేతలతో గొడవలు, భూకబ్జాలు లాంటి రిపోర్టులను చూపించి మాట్లాడారట. దాంతో ఏమి సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్ధంకాలేదట. తొందరలోనే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని కొందరు ఎంఎల్ఏలకు ఫోన్లు వెళ్ళే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం.

అత్యంత వివాదాస్పదంగా ఉంటు, బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన సుమారు 20 మంది ఎంఎల్ఏలతో మాట్లాడాలని కేసీయార్ అనుకున్నారట. అందుకనే ఫాంహౌజ్ నుండి ఫోన్లు చేయించి వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నది. సిట్టింగుల మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను కూడా నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా కేసీయార్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారట. దాన్ని ముందుపెట్టే ఎంఎల్ఏలతో మాట్లాడుతున్నారని సమాచారం. అందుకనే వాళ్ళు కూడా ఆరోపణలన్నీ తప్పులని సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే కనీసం ఓ 25 మంది సిట్టింగులకు టికెట్లతో కోత తప్పదని ప్రచారం మొదలైంది.