Begin typing your search above and press return to search.

వీల్ చైర్లో కేసీఆర్ ప్రచారం.. వర్కవుట్ అవుతుందా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు షురూ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:57 AM GMT
వీల్  చైర్లో కేసీఆర్  ప్రచారం.. వర్కవుట్  అవుతుందా?
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు షురూ చేస్తున్నాయి. ఈ సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన దానికి మించి విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న వేళ... అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బను మరిచిపోవాలంటే, మనుగడకు ఇబ్బంది కలగకూడదంటే... లోక్ సభ ఎన్నికీల్లో సత్తా చాటాలని బీఆరెస్స్ భావిస్తుంది. ఈ సమయంలో... కేసీఆర్ సరికొత్తగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే... ఇది వర్కవుట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశం!

బీఆరెస్స్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు తగిలిన దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో... పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్, హరీష్ లతో దిశానిర్ధేశం చేయిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే మనుగడ ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయని మరోవైపు ఆందోళన నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో వీల్ చైర్ లోనే ప్రచారం చేయాలని కేసీఆర్ భావించారని తెలుస్తుంది.

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తగిలిన గాయం నుంచి కోలుకోకముందే... కేసీఆర్ బాత్రూంలో జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరగడం.. దీంతో, డాక్టర్లు శస్త్ర చికిత్స చేసిన సెట్ చేయడం తెలిసిందే! అయితే ఆపరేషన్ తర్వాత కేసీఆర్ కు కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు డాక్టర్లు చెప్పారు. ఈ సమయంలో కేసీఆర్ కొద్దికొద్దిగా నడుస్తూ.. వీలైనప్పుడు కూర్చుంటూ.. ఎక్కువ సమయం బెడ్ పైనే ఉంటున్నారని అంటున్నారు. అంటే... కేసీఆర్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు!!

అయితే కేసీఆర్ పూర్తిగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే మరింత సమయం పట్టవచ్చని తెలుస్తుంది. దీంతో... ఈలోపు లోక్ సభ ఎన్నికలు పూర్తయినా ఆశ్చర్యం లేదని అంటున్నారంట. దీంతో... శరీరానికి తగిలిన గాయం పెద్ద లెక్క కాదని భావిస్తున్నారో ఏమో కానీ... ప్రచారానికి సిద్ధమైపోతున్నారంట కేసీఆర్. ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం దగ్గరనుంచి.. ఎన్నికల ప్రచారం వరకూ వీల్ చైర్ లోనే అని అంటున్నారు!

ఇందులో భాగంగా... ఆరోగ్యం పూర్తిగా కుదిటిపడేవారకూ ఆగడం కుదరదని భావించిన కేసీఆర్... లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వీల్ చైర్ లోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గతంలోలాగే సుడిగాలి పర్యటనలు చేయాలని.. వీల్ చైర్ లోనే లోక్ సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికీ ఒక్కో మీటింగ్ మాత్రమే పెట్టి.. వీలైనంత త్వరగా సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది.

కాగా... గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ కూడా వీల్ చైర్ లోనే ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది. ఈసారి తెలంగాణలో బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో... కేసీఆర్ కి ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.