Begin typing your search above and press return to search.

రెండు సీట్లలో పోటీ వెనక కేసీయార్ వ్యూహం. ..?

కేసీయార్ ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. నిజంగా కనుక చూస్తే బీయారెస్ విడుదల చేసిన మొత్తం జాబితాలో ఇది చాలా హైలెట్ అవుతున్న అంశం.

By:  Tupaki Desk   |   21 Aug 2023 11:12 AM GMT
రెండు సీట్లలో పోటీ వెనక  కేసీయార్ వ్యూహం. ..?
X

బీయారెస్ అధినేత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. నిజంగా కనుక చూస్తే బీయారెస్ విడుదల చేసిన మొత్తం జాబితాలో ఇది చాలా హైలెట్ అవుతున్న అంశం. ఎపుడూ ఒకే సీటులో పోటీ పడే కేసీయార్ ఈసారి ఎందుకు అలా రెండు సీట్లను అంటున్నారు అన్నది చర్చనీయాంశం అయింది.

మరో వైపు ఒకనాడు కేసీయార్ వెన్నంటి ఉండే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇపుడు బీజేపీ లో ఉన్నారు. తాను కేసీయార్ సొంత సీటు అయిన గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దాంతో పాటు గజ్వేల్ సీటు కేసీయార్ వదిలేస్తున్నారు అని కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఇపుడు సడెన్ గా కేసీయార్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా రెండవ సీటుగా ఎంచుకుని పోటీకి దిగడం అంటే చాలా వ్యూహాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు.

నిజానికి ఉత్తర తెలంగాణాలో బీయారెస్ కి ఊపు తేవాలన్న ఉద్దేశ్యంతోనే కేసీయార్ కామారెడ్డిని ఎంచుకున్నారని అంటున్నారు. ఉత్తర తెలంగాణాలో విపక్షాలు కూడా ఫోకస్ పెట్టి ఉంచాయి. దాంతో అక్కడ మరింతగా పట్టు సాధించేందుకు తానే పోటీ చేస్తే బాగుంటుందని కేసీయార్ భావించే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

దీని మీద మీడియా ప్రశ్నలకు కూడా కేసీయార్ జవాబు ఇచ్చారు. తనను రెండవ సీటులో పోటీ చేయమని పార్టీ కోరిందని, అందుకే అలా డెసిషన్ తీసుకున్నామని అన్నారు. ఇక కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు నిజామాబాద్ జిల్లా మంత్రి కూడా కోరడంతోనే పోటీకి సిద్ధపడ్డాను అని కేసీయార్ అంటున్నారు. ఉత్తర తెలంగాణాలో కామారెడ్డి కీలకమైన ప్లేస్ లో ఉంది. దాంతో విపక్షాల వ్యూహాన్ని దెబ్బ తీయడం కోసమే కేసీయార్ ఈ విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే గజ్వేల్ సీటు కేసీయార్ కి సేఫెస్ట్ గానే ఉందని అంటున్నారు రెండవ సీటు నుంచి పోటీ చేయడం ద్వారా విపక్షాలకు కేసీయార్ ఆయుధాన్ని ఇచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. గజ్వేల్ లో కేసీయార్ ని ఓడిస్తామని విపక్షాలు అంటున్నాయి. ఈటెల అయితే నేనే పోటీకి రెడీ అని సవాల్ కూడా చేశారు. మరి గజ్వేల్ నుంచి కేసీయార్ వేరే సీటుకు వెళ్ళినా ఇబ్బందే. అది కూడా విపక్షాలు ప్రచారానికి వాడుకుంటాయి. అందుకే రెండవ సీటుకు పోటీ చేయడం ద్వారా ఏ రకమైన టెన్షన్ పెట్టుకోకుండా విపక్షాలకు టెన్షన్ పెట్టడమే కేసీయార్ వ్యూహం అనుకుంటున్నారు.

ఇక ఉద్యమ కాలం నుంచి బీయారెస్ కి నిజామాబాద్ జిల్లాలో పట్టు ఉంది. అయితే అక్కడ 2019 లో బీజేపీ ఎంపీ సీటు పట్టుకునిపోయింది. ఓడింది స్వయంగా కేసీయార్ కుమార్తె కవిత. అందుకే ఈసారి తాను అక్కడ నుంచ్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలపై కూడా ప్రభావం ఉంటుందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మరోసారి క్లీన్‌స్వీప్ చేసేందుకే బీయారెస్ అధినేత ఈ వ్యూహం పన్నారని అంటున్నరు.

కామారెడ్డిలో పోటీ విషయంలో అనేక సర్వేలు కూడా కేసీయార్ చేయించుకున్నారని అంటున్నారు. అన్నీ అనుకూలంగా రావడంతోనే ఆయన బరిలోకి దిగారని అంటున్నారు. అయితే గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీకి దిగుతున్న కేసీయార్ కి ఎక్కడ మెజారిటీ ఎక్కువ వస్తుంది అన్న చర్చకు కూడా తెర లేస్తోంది. అలాగే ఏ సీటుని ఆయన ఉంచుకుంటారు, ఏది వదులుకుంటారు అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే గజ్వేల్ లో గెలిచినా విడిచిపెట్టి కామారెడ్డినే ఈసారి కంటిన్యూ చేస్తారని అంటున్నారు. దానికి కారణం 2024లో జరగబోయే ఎంపీ ఎన్నికలు నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయాల్సి ఉన్నదని అంటున్నారు.